-కుటుంబ విలువలు తెలియని చంద్రబాబు
-టిడిపి తప్పుడు ప్రచారం చెయ్యడంలో సిగ్గు,ఎగ్గూ వదిలేసింది
-ట్విట్టర్ లో ఎంపి విజయసాయిరెడ్డి
ప్రతిపక్ష నేత చంద్రబాబు కరకట్ట ఇంటి దగ్గరే కృష్ణలో ఇసుక అక్రమ డ్రెడ్జింగుతో కృత్రిమ ద్వీపాల ఏర్పాటుకు అనుమతించారని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి
మండిపడ్డారు.ట్విట్టర్ లో పలు అంశాలపై ఆయన స్పందించారు. చంద్రబాబు పర్యావరణ విధ్వంసం గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. రిక్రియేషన్ సెంటర్లు వస్తే టూరిస్టులను ఆకర్షించవచ్చని కుల మీడియాలో టిడిపి అధినేత వ్రాయించాడాని గుర్తు చేశారు.
లక్షల కోట్ల అమరావతి స్కామ్ మొదలు ఇసుక, మట్టి, లేటరైట్, పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని మందుల వరకు మాఫియా వ్యవస్థలను సృష్టించి చెదపురుగుల్లా రాష్ట్రం మీదకు వదిలిన చరిత్ర చంద్రబాబుదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలువలు లేని చంద్రబాబు కుటుంబం విలువలు గురించి మాట్లాడటం ఏంటిని ఆయన ప్రశ్నించారు.తల్లిదండ్రులు మరణిస్తే తలకొరివి పెట్టనోడు, సోదరుణ్ణి గొలుసులతో బంధించినోడు. లోకేష్ తాత ఎవరంటే ఖర్జూరనాయుడు పేరు దాచిపెట్టి ఎన్టీఆర్ అంటూ ప్రచారం చేస్తున్నోడు చంద్రబాబు కాదా అని ఆయన ప్రశ్నించారు.
విపత్తు నిర్వహణపై ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలపై ఘాటుగా స్పందించారు. పచ్చకామెర్లు సోకిన చంద్రబాబు కళ్ళకు ప్రభుత్వం చేసే మంచి పనులేవీ కనిపించవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బస్సులో పడుకున్నట్లు పోజులిస్తాడు,కోడుకు లోకేశ్ బుల్లెట్ బండెక్కి ముంపు ప్రాంతాలంటూ పురవీధుల్లో షికారు చేస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అనుకుల మీడియా ఎదో చేసేసినట్టు భజన మొదలు పెట్టేవారని చెప్పారు.
అమరావతిని కొలంబో చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడని, ఆయన్ని దింపి ప్రజలు రాష్ట్రాన్ని, తమను తాము కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిడిపి అధినేతను కొలంబో పంపిస్తారని చెప్పారు.చంద్రబాబుకు స్నేహితుడైన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయను శరణార్థిగా సింగపూర్ అనుమతించడం లేదట అని చెప్పారు. రాజభవనంలో ఉండాల్సినోడిని బాబు చెత్త సలహాలతో శరణార్థిగా మార్చేశాడని పెర్కోన్నారు.
టిడిపి తప్పుడు ప్రచారం చెయ్యడంలో సిగ్గు,ఎగ్గూ వదిలేసిందని మండిపడ్డారు . ఏపి 25 ఎక్కడిదో ఈ 420లకు తెలియదా? అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నిజామాబాద్ ఆక్సిడెంట్ ఫోటోలు పెట్టి వాటిని ఆంధ్రాకు ఆపాదించి అడ్డంగా దొరికిపోయారని చెప్పారు. ఈ విష ప్రచారం చూస్తుంటే రోడ్లను టీడీపీ వాళ్ళే తవ్వుతున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.