జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రూపంలో ధ‌న‌పిశాచిని చూస్తున్నాం

Spread the love

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

ర‌క్త పిశాచుల గురించి విన్నాం. తొలిసారిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రూపంలో ధ‌న‌పిశాచిని చూస్తున్నాం. రోజూ నోట్ల‌క‌ట్ట‌ల‌తో వంట చేసుకుని, నోట్ల‌క‌ట్ట‌లే రోజూ తిన్నా ప‌దిత‌రాల‌కి త‌ర‌గ‌నంత దోచి దాచుకున్నా జ‌గ‌న్‌రెడ్డి గారికి ఇంకా ధ‌న‌దాహం తీర‌డంలేదు. నిరుపేద‌లు, కూలీలు రోజంతా రెక్క‌లు ముక్క‌లు చేసుకుని సంపాదించిన డ‌బ్బునీ మ‌ద్యం పేరుతో లాగేస్తున్నారు. జ‌గ‌న్‌రెడ్డి బినామీలు త‌యారు చేసి అమ్ముతోన్న మ‌ద్యంలో విష‌ర‌సాయ‌నాలున్నాయ‌ని తెలుగుదేశం పార్టీ ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెడితే, మ‌ద్యంపై ఆదాయం రావ‌డం టిడిపికి ఇష్టంలేదంటూ కొత్త ఏడుపు మొద‌లుపెట్టారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి ప‌దులసంఖ్య‌లో మృత్యువాత‌ప‌డితే స‌హ‌జ‌మ‌ర‌ణాలంటూ శ‌వాల‌పై నోట్లు ఏరుకున్నారు. చిల‌క‌లూరిపేటలో జే బ్రాండ్ మ‌ద్యం తాగి ఇద్ద‌రు చ‌నిపోతే, కేసుని నీరుగార్చేశారు. ఇప్పుడు బాప‌ట్ల‌ జిల్లా రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో మీరు త‌యారుచేసి మీరే అమ్ముతోన్న విష‌మ‌ద్యం తాగి ముగ్గురు బ‌ల‌య్యారు. మరి కొంత మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా ఇసుకపల్లి ప్రభుత్వ మద్యం షాపులోనే మద్యాన్ని కొన్నారు.

మ‌హిళ‌ల తాళిబొట్లు తెంచే సొంత విష‌మ‌ద్యం అమ్మ‌కాల‌తో లాభం, వేరే మ‌ద్యం అమ్మాలంటే క‌మీష‌న్లు, మ‌ద్యం ఆదాయంపై అప్పులు, మ‌ద్యంపై బాండ్లతో కోట్లు, మ‌ద్యంషాపులో వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కి ఉద్యోగాలు ఇన్ని లాభాలు పొందుతున్న జ‌గ‌న్‌రెడ్డి గారు జ‌ల‌గ‌లా ప్ర‌జ‌ల్ని పీల్చేస్తున్నారు. విష‌మ‌ద్యంతో ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తూ కోట్లు లెక్క పెట్టుకుంటున్న ముఖ్య‌మంత్రి గారూ మీ జే బ్రాండ్ విష‌మ‌ద్యంతో ఇంకెంద‌రిని బ‌లి తీసుకుంటారు? ప్ర‌భుత్వ మ‌ద్యం దుకాణాల్లో జే బ్రాండ్లు అమ్మ‌కం నిలిపేయాలి. రాష్ట్ర‌వ్యాప్తంగా అన్నివైన్‌షాపుల నుంచీ శాంపిళ్ల‌ని సేక‌రించి ల్యాబుల్లో ప‌రీక్షించాలి. జే బ్రాండ్స్ తాగి చ‌నిపోయిన ఒక్కొక్క‌రి కుటుంబానికి 50 ల‌క్ష‌ల ప‌రిహారం ఇవ్వాలి. ప్ర‌జారోగ్యాన్ని హ‌రిస్తూ, ప్ర‌మాద‌క‌ర మ‌ద్యంతో ప్ర‌జ‌ల ప్రాణాలు తీస్తూ వేల‌కోట్లు వెనకేసుకుంటున్న మ‌ద్యం మాఫియాపై కేంద్రం సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాలి.

Leave a Reply