Suryaa.co.in

Andhra Pradesh

సజ్జల,విశ్వరూప్ తో సాయి ప్లెక్సీలు

– మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల దగ్ధంకు ముందే, కుటుంబ సభ్యులను తరలించారు
– ఆ ఇంట్లో ఒక డాక్యుమెంట్ కూడా కాలి పోలేదు?
– మంత్రి ఇల్లు దగ్ధం అవుతుంటే ఫైరింజన్లు ఎందుకు రాలేదు?
– బాస్ నుంచి అనుమతి రాకపోవడం వల్లే, ఫైర్ ఇంజన్లు రాలేదా?
– ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అన్ని కులాలవారు అభిమానిస్తారనీ, అభిమానించని వ్యక్తులంటూ ఏ కులంలో ఉండరనీ నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు.

రాజ్యాంగాన్ని రచించిన బి.ఆర్ జాతీయస్థాయి నాయకుడని , అటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను,. ఆంధ్రప్రదేశ్ లోని ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడం అంటే, ఆయన స్థాయిని తగ్గించడమే అవుతుందని అని చెప్పారు ..డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అమలాపురానికి ఉన్న సంబంధం ఏమిటినీ ఒక్కసారి ఆలోచిస్తే… ఏమీ లేదని స్పష్టమవుతుందన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 26 జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు, అల్లూరి పేరిట మన్యం జిల్లాను…, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పెరిగిన ప్రాంతానికి ఆయన పేరు, కడప జిల్లా పేరును మార్చి వైయస్సార్ జిల్లాగా నామకరణం చేశారనీ, అదే సమయంలో కోనసీమ జిల్లా కు కూ డా బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో నని రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.

కానీ ఇప్పుడు సమయం… సందర్భం లేకుండా, వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న, గతం లో జరిగిన దాష్టీకాలను కప్పిపుచ్చుకునేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు తెరపైకి తీసుకురావడం శోచనీయమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ నామకరణం చేయడానికి ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఈనెల 18న నోటిఫికేషన్ జారీ చేసి, నెల రోజుల గడువు వ్యవధిని ఇచ్చారన్నారు. అయితే, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో అన్ని ఆలోచించుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని… తగ్గేదే లే అన్నారని గుర్తు చేశారు. అంటే ముందుగానే నిర్ణయించుకొని, ప్రజాభిప్రాయాన్ని కోరినట్టు స్పష్టమవుతోందన్నారు. ముందే నిర్ణయించుకున్న తర్వాత ప్రజాభిప్రాయం అనే సినిమా స్టంట్ .. చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

బుధవారం రచ్చబండ కార్యక్రమం లో భాగంగా ఢిల్లీలో రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… గతంలో జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరారని, కోనసీమకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టే విషయం లో, ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ ద్వారా ప్రజాభిప్రాయానికి కోరాలని అన్నారు. కోనసీమ లోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి ఓటింగ్ పెట్టడం కానీ, మొత్తం జిల్లా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఓటింగ్ ను పెట్టడం చేయాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరికీ ఆరాధ్యడు కాబట్టి మెజార్టీ ప్రజలు ఇదే పేరు కోరుకునే అవకాశం ఉందని, కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తే… ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లా పేరును ఏర్పాటు చేసినట్లు అవుతుందని, ఇంకా ఎవరూ ప్రశ్నించే అవకాశం ఉండదన్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఈ తరహా నిర్ణయం తీసుకోవాలన్నారు. కోనసీమ లో జరిగిన ఆందోళన వెనుక అధికార, ప్రతిపక్షాలు ఉన్నాయన్న ఆరోపణలు, ప్రత్యారోపణలు వినిపిస్తున్నాయని కానీ అధికార పక్షానికి చెందిన సాయి పేరు వినిపిస్తోందనీ అన్నారు.. సజ్జల., విశ్వరూప్ తో సాయి ఏర్పాటు చేసిన ప్లెక్సీలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని చెప్పారు. సాయినే తొలుత ఒంటిపై పెట్రోలు పోసుకున్నట్లు నటించి ఆ పాత్రకు న్యాయం చేశారన్నారు. ఈ దాడుల్లో ఆయన ప్రముఖ పాత్ర పోషించినట్లు మాట్లాడుకుంటున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. కోనసీమ వాసుల మనోభావాలు, రాయలసీమ వాసుల కి ఏమి తెలుసునని అన్నారు.

కోనసీమ జిల్లా పై తీసుకున్న నిర్ణయం ఇతర జిల్లాలకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల దగ్ధం కు ముందే, కుటుంబ సభ్యులను తరలించారని, ఆ ఇంట్లో ఒక డాక్యుమెంట్ కూడా కాలి పోలేదన్నారు. ఎమ్మెల్యే, మంత్రి ఇల్లు దగ్ధం అవుతుంటే ఫైరింజన్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న బాస్ నుంచి అనుమతి రాకపోవడం వల్లే, ఫైర్ ఇంజన్లు రాలేదా అని ప్రశ్నించారు.

ఇంట్లో మనుషులను జాగ్రత్తగా కాపాడిన పోలీసులు, అరికట్టలేక పోయారంటే… పోలీసు వైఫల్యం కాదా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.రాజకీయ లబ్ది కోసమే ఈ రణరంగ మని ప్రజలు అంటున్నారని, తన వ్యక్తిగత భావనతో పనిలేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కోనసీమ ఆందోళన లో తమ పార్టీ వారే ఉన్నారనీ సుస్పష్టమన్న రఘురామకృష్ణంరాజు, ప్రతిపక్షాల పాత్ర అస్పష్టమైన పేర్కొన్నారు. ఈ విషయాన్ని రెండవసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విశ్వరూపే అంగీకరించడం… పరిశీలిస్తే, ఎవరి పాత్ర ఏమిటో స్పష్టం అవుతోందన్నారు..

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గత మూడేళ్లలో విదేశీ పెట్టుబడులలో .7 శాతం మాత్రమే అన్నారు. నెంబర్లతో 1..461 వేల కోట్లు మాత్రమేనని అన్నారు. గతం లో లావోస్ వెళ్తే ఏం వస్తాయని అన్నవారు, ఈ పెట్టుబడులన్నీ. దావోస్ కు వెళితే వచ్చాయా అన్న విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ఈ పెట్టుబడులలో, విదేశీ పెట్టుబడి లేన్ని , స్వదేశీ పెట్టుబడులు ఎన్నో చెప్పాలన్నారు..హైడ్రో స్కీమ్ ద్వారా రాష్ట్రానికి ఎంత ఉచిత విద్యుత్ ఇస్తున్నారన్న విషయాన్ని స్పష్టం చేయాలని రఘు రామ డిమాండ్ చేశారు. .పిపి ఏ లు ఏమిటి, ఆ ఏమిటన్నది బయట పెట్టాలన్నారు. ఈ కంపెనీల ద్వారా పదివేలు 15 వేల ఉద్యోగాలు వస్తున్నాయని చెబుతున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని ప్రశ్నించారు.. స్థానిక పారిశ్రామికవేత్తలతో దావోస్ కు వెళ్లి ఒప్పందాలు కావాల్సిన అవసరం లేదని రఘురామ ఎద్దేవా చేశారు.

ఆ పథకం పేరు మార్చండి
జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పేర్లను మార్చి విద్యాధికుడై న అంబేద్కర్ పేరిట డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విద్యా దీవెన, వసతి దీవెన గా మార్చాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని రాజీనామా చేసి న తర్వాతే తమ పార్టీలోకి తీసుకుంటామని విలువల గురించి చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకని వలువలు విడిచారని ప్రశ్నించారు.

పార్టీ మారిన వారి పై సస్పెన్షన్ వేటు వేయాలని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎందుకని ఐదు మందిపై అనర్హత వేటు వేయడం లేదని నిలదీశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల గురించి ఊరూరు, వీధి, వీధి ప్రచారం చేస్తున్న ఐదు మందిపై అనర్హత వేటు వేయకుండా, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందుకు వచ్చి లక్ష్మణ రేఖ దాటని తనపై అనర్హత వేటు వేయాలని కోరడం చూస్తుంటే… చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది మరొకటి అన్నట్లుగా ఉందని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE