బిజెపి లోకి పారిశ్రామికవేత్త లు
ఉమ్మడి చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా,కృష్ణా జిల్లాల నుంచి బీజేపీలో చేరికలు.
పురందేశ్వరి సమక్షంలో బీజేపీలో చేరిన పలువురు నేతలు.
రాయచోటి కి చెందిన పారిశ్రామికవేత్త వీరాంజనేయ ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కు చెందిన నంబూరి శ్రీ నివాస్ రావు బిజెపి లో చేరిక
పార్టీ లోకి ఆహ్వానించి న బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి
విజయవాడ: ఎన్టీఆర్ తర్వాత బీసీల గురించి ఆలోచన చేస్తోంది మోడీనే. ఓబీసీ కులాలకు న్యాయం చేయాలనే ఆలోచన నరేంద్ర మోడీలో ఉంది. ఎస్సీ కమిషన్ తరహాలో ఓబీసీ కమిషనుకు చట్టబద్దత కల్పించింది ప్రధాని మోడీనే. ఓబీసీ కమిషనుకు చట్టబద్దత కల్పించడం ద్వారా ఆ వర్గాలకు భరోసా కల్పించాం. సైనిక్ స్కూళ్లల్లో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాం.
ఐఐటీల్లో ఓబీసీ కోటా కింద ట్యూషన్ ఫీజు మినహయింపు ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఓబీసీల కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలను ఏపీలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, రాజంపేట జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.