పొత్తు ఉంటే… మా కేంద్ర పెద్దలే ప్రకటిస్తారు

– 75 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్దం
– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ : రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల వివరాలు మీడియా కు వివరించారు. నిన్న, నేడు రాష్ట్రం లో రాజకీయ పరిస్థితులు చర్చించాం. జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితి పై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు తో చర్చించాం. మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నాం.

జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మత్ లేఖ ను ప్రజల్లోకి తీసుకేళ్లమని చెప్పారు. 50 వేల ప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నాం. సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం. 175 అసెంబ్లీ, 25 ఎంపి సీట్ల లో అభ్యర్థులు పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. వీటిని మా జాతీయ నాయకత్వానికి వివరిస్తాం.

మా అధిష్టానం నిర్ణయం బట్టి మా అడుగులు ఉంటాయి. పోటీ చేసే అభ్యర్థులు 2000 మంది వరకు వచ్చారు. మా స్థాయి లో వాటిని క్రోడీకరించి ఒక్కో నియోజకవర్గం లో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. మా పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులు ను ఖరారు చేస్తారు.

పొత్తు ఉంటే… మా కేంద్ర పెద్దలే ప్రకటిస్తారు. 175 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్దం చేశాం. ఏ నియోజకవర్గం లో ఏ అభ్యర్థి బెటర్ అనే దాని పైనే చర్చ సాగింది. మా జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతాం. ఆ తర్వాత మా జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుంది.

 

Leave a Reply