చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త సిఎం జగన్ మోహన్ రెడ్డి

34

-అమూల్ బేబీ జాగ్రత్త ….మిమ్మల్ని బంగాళా ఖాతంలో కలిపేస్తా
-అమూల్ బేబీ సంగం రైతులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు
-రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే
-పోలీసులు సాయిరెడ్డి ఫోన్ వెతికి పెట్టాలి
-చేబ్రోలు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ మైనింగ్
-పొన్నూరు నియోజకవర్గం అంటేనే అధికారులు హడలిపోతున్నారు
-గుంటూరు జిల్లా,పొన్నూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి -కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు

ప్రజలు నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఊళ్లకు ఊళ్లు కదిలి మన కార్యక్రమానికి వస్తున్నారు. యువత, మహిళలు, యువతులు సైతం రోడ్డుమీదకు వచ్చి స్వాగతం పలికారు. నా జీవితంలో మహిళల్లో ఇంత స్ఫూర్తి ఎప్పుడూ చూడలేదు. మగవారికి పోటీగా మహిళలు తరలివస్తున్నారు. నాకు పొన్నూరు కొత్త కాదు…అనేక సార్లు వచ్చాను. 7 సార్లు ఇక్కడ టిడిపి గెలిచింది. అలాంటి నియోజకవర్గానికి అనేక సార్లు వచ్చాను. నేను సినిమా యాక్టర్ కాదు….నా సినిమా రిలీజ్ కాలేదు…అయినా జనంలో అద్భుత స్పందన ఉంది. రాష్ట్రంలో అన్ని రకాలుగా ధరలు పెరిగిపోయాయి…..కరెంట్ చార్జీలు, నిత్యావసర సరుకులు, మద్యం రేట్లు పెరిగాయి…ఇంటి పన్ను పెంచారు.

చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త సిఎం జగన్ మోహన్ రెడ్డి జగన్ రూ.10 పడేసి….అవి మనవే అని చూసుకునే సరికి రూ.10 వేలు కొట్టేస్తున్నాడు. జగన్ ఇచ్చేది సంక్షేమం కాదు…తెచ్చింది సంక్షోభం. మనం ఇంత మీటింగ్ పెట్టుకుంటే మన మీటింగ్ లో అలజడి సృష్టించేందుకు వైసిపి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు..? మీ పనితీరుకు అవార్డులు ఇవ్వాలి.

సైకోలను వదిలేది లేదు. రాష్ట్రంలో అందరికీ ఈ పాలనతో కష్టాలు….అందుకే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అని పేరు పెట్టాను.7 సార్లు పొన్నూరులో గెలిచిన కుటుంబం దూళిపాళ్ల కుటుంబం. జగన్ ఒక అమూల్ బేబీ. జగన్ ఎందుకు అమూల్ ను తెచ్చాడు.? అమూల్ డైరీ తెచ్చి…..రాష్ట్ర అస్తులు రాసిఇస్తున్నాడు. అమూల్ బేబీ జాగ్రత్త ….మిమ్మల్ని బంగాళా ఖాతంలో కలిపివేస్తా.

అమూల్ బేబీ సంగం రైతులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. జగన్ కు పోలీసులు ఉన్నారు….నాకు 5 కోట్ల ప్రజలు ఉన్నారు. నాలుగేళ్ల తరువాత జగన్ రెడ్డికి బిసిలు గుర్తుకొచ్చారు. జగన్ వెనుక నలుగురు ఉన్నారు….నిజమే…సజ్జల, సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఉన్నారు. నాకు కులం లేదు..మతం లేదు….నా కులం పేదరికం. అన్ని కులాలకు నేనే ప్రతినిధి. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ టిడిపి టిడిపి డిఎన్ఎలో వెనుకబడిన తరగతులు ఉన్నారు.

నీ బాబాయి సుబ్బారెడ్డి తూర్పు గోదావరి వెళితే…బిసి మంత్రి ఆయన కాళ్లు మొక్కాలా. బుధవారం బిసి సభ పేరుతో బస్సులు పెట్టి బలవంతంగా జనాన్ని తరలించారు.సభకు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారు మనం అనుకుంటే జగన్ అధికారం కట్ చేస్తాం….సహాయ నిరాకరణ ప్రారంభించాలి.image-2 పొన్నూరులో మిమ్మల్ని చూశాక నాకు అనుమానాలు తీరిపోయాయి. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఈ మీటింగ్ చూసి సైకో జగన్ రెడ్డికి ఇక నిద్ర రాదు. రేపు మంత్రులను పంపి మనల్ని తిట్టిస్తాడు.నాడు ముద్దులు పెట్టాడు…..ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు ఈ జగన్ రెడ్డి.ఇచ్చేది గోరంత…దోచేది కొండంత. అన్న క్యాంటీన్ ఏం తప్పు చేసింది…పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం ఎందుకు రద్దు చేశారు..?

ఎపిలో జలగ రెడ్డి అన్న క్యాంటీన్ తీసివెయ్యడమే కాకుండా మనం పెట్టిన క్యాంటీన్ లను కూడా అడ్డుకుంటున్నాడుబిసిలంతా ఇదేం ఖర్మ మన బిసిలకు అంటున్నారు. మనం జయహో బిసి పేరు పెట్టుకున్నాం. దాన్ని కాపి కొట్టి జగన్ మీటిండ్ పెట్టుకున్నాడుమళ్లీ మన ప్రభుత్వం రాగానే బిసిలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాము.చంద్రన్న భీమా వస్తుందా..? ఎందుకు ఇవ్వడం లేదో గడప గడపకు వచ్చే వైసిపి ఎమ్మెల్యేలను నిలదీయండి.

సంక్రాంతి కానుక వస్తుందా..?నిరుద్యోగులకు జగన్ మటన్ కొట్లో, ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు ఇచ్చాడుమనం ఐటి ప్రోత్సహించి మంచి మంచి ఉద్యోగాలు ఇచ్చాం. ఉన్నత చదువులు చదువుకున్న వారు అంతా బయటకు వెళ్లిపోయారు. జగన్ రెడ్డి వచ్చిన తరువాత ఒక్క పరిశ్రమా రాలేదు….ఎపిలో ఉన్న అమరరాజా సంస్థను కూడా పక్క రాష్ట్రానికి తరిమేశారు.

అమూల్ బేబి జగన్ రెడ్డి పెట్టే కేసులకు నేను భయపడతానా….క్లైమోర్ మైన్స్ కు భయపడని నేను..నీ తప్పుడు కేసులుకు భయపడతానా.? దొంగ కేసులు పెట్టేవారిని దొంగలు అనక ఏమంటాం.? ధూళిపాళ్ళimage-1 నరేంద్రను తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపినట్లు అందరినీ జైలుకు పంపాలి అని చూస్తున్నాడు. దేశంలో ఎక్కువ డ్రగ్స్ పట్టుబడిన రాష్ట్రం ఏపీ.దేశంలో ఎక్కువ సీబీఐ కేసులు ఉన్న రాష్ట్రం ఏపీ…జగన్ రెడ్డి దీనికి సిగ్గుపడాలి.డిల్లీ లిక్కర్ స్కాం రాగానే….సాయిరెడ్డి ఫోన్ మిస్ అయ్యింది. పోలీసులు సాయిరెడ్డి ఫోన్ వెతికి పెట్టాలి.40 ఏళ్లలో ఎక్కడా తప్పు చెయ్యకుండా పాలించిన పార్టీ టిడిపి.

సొంత బాబాయిని చంపిన జగన్ రెడ్డి నిన్ను నన్ను లెక్కపెడతాడా.? వివేకాది గుండెపోటు అన్నాడు…. నేను చంపాను అన్నాడు. సునీతా రెడ్డి పోరాటంతో కేసు పక్క రాష్ట్రానికి బదిలీ అయ్యింద. ఒకప్పుడు జగనన్న బాణం షర్మిల విషయంలో ఇప్పుడు జగన్ మాట్లాడలేని పరిస్థితి. షర్మిల అరెస్టుపై ఎందుకు మాట్లాడలేదు అని స్వయంగా ప్రధాని జగన్ ను అడగారు. ఎస్సీలకు చెందిన 28 కార్యక్రమాలు రద్దు చేశాడు. 39 టీడీపీ వారిని హత్య చేస్తే అందులో 26 మంది బిసిలే ఉన్నారు.

ఒక ఎస్సి డ్రైవర్ ను చంపి వైసిపి ఎమ్మెల్సీ డెడ్ బాడీ ఇంటికి పంపాడు.మైనారిటీలకు ఇచ్చే పెళ్లి కానుకపోయింది…రంజాన్ తోఫా పోయింది.జగన్ బటన్ నొక్కితే ఇసుక డబ్బు, మైనింగ్ డబ్బు, ల్యాండ్ డబ్బు ఇంటికి చేరుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే కిలాడి రోశయ్య….ఆయన చిట్టా కూడా బయటపెడతాము. ఎవరినీ వదిలిపెట్టను ఉతికి ఆరేస్తాను. దేశంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా.? పట్టిసీమ కట్టి ఈ ప్రాంతానికి నీటి కొరత లేకుండా చేశాను. 72 శాతం పూర్తి చేసిన పొలవరాన్ని నాశనం చేశారు.

రాష్ట్రంలో జగన్…..పొన్నూరులో ఈ ఎమ్మెల్యే అన్ని రివర్స్ చేశారు. పట్టణంలో రూ.175 కోట్లతో 2368 టిడ్కో ఇళ్లు కట్టాం. 85 శాతం పూర్తి అయిన వాటిని అలాగే వదిలేశారు. లబ్దిదారులకు ఇవ్వలేదు. నియోజకవర్గంలో చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం బిల్లులు చెల్లించలేదు. గుంటూరు చానెల్ అభివృద్దికి రూ.325 కోట్లు ఇచ్చాం. ఆ పనులు ఆపేశారు. గుంటూరు – బాపట్ల రోడ్ లో కొమ్మమూరు సాగునీటి కాలువపై కొత్త వంతెనకు రూ.30 కోట్లు నిధులు ఇస్తే దాన్నీ నిర్మించలేదు.

పొన్నూరును ఎమ్మెల్యే మట్టి, కంకర, భూములు, బార్లు, వెంచర్లు..చివరికి బ్లీచింగ్ కొనుగోళ్లలో కూడా అక్రమాలు చేస్తున్నాడు పొన్నూరు నియోజకవర్గం అంటేనే అధికారులు హడలిపోతున్నారు…ఇప్పటికే 30 మందిని సస్పెండ్ చేయించాడు. మరో అధికారి సెలవులో వెళ్లిపోయాడు. అక్రమాలకు సహకరించకపోతే అధికారులపై ఒత్తిళ్లు…వేధింపులు చేస్తున్నాడు.

చేబ్రోలు పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున గ్రావెల్ అక్రమ మైనింగ్. ఎకరానికి రూ.30 లక్షల ఇవ్వాలి… లేదంటే తవ్వకాల్లో భాగస్వామ్యం ఇవ్వాల్సిందే. ఇదీ కిలాడి ఎమ్మెల్యే తీరు. ఎక్కడ లే అవుట్ వేసినా ఎకరానికి రూ.10 లక్షలు కప్పం ఎమ్మెల్యేకి కట్టాల్సిందే. ఇటీవల ఇచ్చిన బార్ లైసెన్స్ లకు రూ.20 లక్షల చొప్పున వసూలు. రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా పొన్నూరు ను మార్చిన ఘనుడు ఈ వైసీపీ ఎమ్మెల్యే. రేషన్ మాఫియా నుంచి నెలకు రూ.10 లక్షల ముడుపులు తీసుకుంటున్నాడు.