– కమీషన్లు అన్నం పెట్టవు.
– మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ,జిల్లాపరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,కార్మిక విభాగం నేత రూప్ సింగ్
ఎస్సారెస్పీ పేస్ 1,పేస్ 2 కు నీళ్లు ఇవ్వలేము యాసంగి పంట తక్కువ వేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. రైతులకు యాసంగి పంట ముఖ్యమైనది.
మెడిగడ్డ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేతిలో నిర్ణయం ఉందని ప్రభుత్వం అంటోంది.
డ్యామ్ సేఫ్టీ చట్టంలో ఎక్కడా ప్రాజెక్టు రిపేర్లు చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలని లేదు. వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలు అయ్యాయి. రైతుల యాసంగి పంటకు చివరి తడి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. మేడిగడ్డ,అన్నారం,సుందిళ్ళ బ్యారేజీలపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సూచనలు చేసే అధికారం మాత్రమే ఉంది. వేల టీఎంసీల నీళ్లు వెళ్లినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు. రిక్టర్ స్కేల్ పై 5 .3 భూకంపం వచ్చినా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏం కాలేదు. కేసీఆర్ ను బద్నాం చేయడానికి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది అని చెప్పి కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. కమీషన్లు ఏం చేస్తాయి? కమీషన్లు అన్నం పెట్టవు.
పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో చిన్న తప్పులు జరగడం సహజం. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాను.