– విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ప్రకాశం: చర్చల ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియతో మాట్లాడుతూ ప్రభుత్వం చర్చలకు పిలిచినప్పుడు ఉద్యోగులు వచ్చి చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. చిన్న సమస్యను ఉద్యోగులు ఇంత రాద్ధాంతం చేయడం సరికాదని మంత్రి బాలినేని అన్నారు. విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నా విద్యుత్ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇచ్చామని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా అవకాశం ఉన్నంతమేరకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.