-జగన్‌పై హత్యాయత్నం కుట్రదారుల్ని తేల్చాలి
-ఈ ఘటనపై లోతైన విచారణ జరగాలని కోరడం తప్పా..?
-కోర్టు కేసులపై పత్రికల్లో విషపు రాతలు సరి కావు
-డీఎల్ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో..
-ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి కన్నబాబు హెచ్చరిక
ఒకే చేతి వేళ్లు బాబు, రామోజీ, రాధాకృష్ణ:
చంద్రబాబు ఆయన భజన బృందాలు, ఎల్లో మీడియా కలిసి ఈమధ్య సీఎం వైయస్ జగన్‌పై ముప్పేట దాడి చేస్తున్నామని తెగ సంబర పడిపోతున్నారు. రోజుకో కూత కూస్తూ.. రాత రాస్తూ ఇష్టానుసారంగా పేట్రేగిపోతూ.. ఎన్‌ఐఏ విచారణ జరుగుతున్న కేసులకు సంబంధించి కూడా వాళ్లకు వాళ్లే తీర్పులిస్తూ శునకానందం పొందుతున్నారు. ఒక విషయాన్ని చంద్రబాబు మాట్లాడితే రామోజీ, రాధాకృష్ణ రాస్తారు. లేదంటే, వాళ్లిద్దరూ రాసిన విషయాన్ని చంద్రబాబు మాట్లాడతాడు. అంటే, వీళ్లంతా ఒకే చేతికి పుట్టిన వేళ్లలాంటి వారని చెప్పాలి. ఈ విధంగా టార్గెట్ పెట్టుకుని ప్రచారం చేస్తూ ప్రజల్ని భ్రమకు గురి చేయడంలో చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణతో పాటు ఇతర ఎల్లో మీడియా వ్యక్తులు పెద్ద దిట్టలుగా చెప్పుకోవచ్చు. వారి కుట్రల్లో భాగమే ఆరోజు విశాఖపట్నం ఏయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నంపై ఈరోజు తప్పుడు కూతలతో రాస్తున్నారు.
బాధ్యత లేని పరిపాలకుడు బాబు:
రెండు మూడు రోజులుగా చంద్రబాబు కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. వాటన్నింటినీ రామోజీరావు తన పత్రికలో రాస్తున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌గారిపై హత్యాయత్నం జరిగితే దాన్ని కూడా చంద్రబాబు ఎగతాళి చేశాడు. ఆయన గళానికి తందానా అంటూ రామోజీ, రాధాకృష్ణ వంత పాడారు. 2019 ఎన్నికల్లో సానుభూతి కోసమే జగన్, తనకుతాను ఆ దాడి చేయించుకున్నాడని అనడానికి చంద్రబాబుకు నోరెలా వచ్చింది? విపక్షనేతపై ఏకంగా హైసెక్యూరిటీ ఉంటే ఎయిర్‌పోర్టులోనే హత్యాయత్నం జరిగితే, అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఏ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడారు. అందుకే చంద్రబాబు బాధ్యత లేని పరిపాలకుడు.
కోడికత్తి పంపుతా. పట్టుకుంటావా బాబూ?:
అత్యంత పదునుగా ఉండే కోడికత్తితో దాడి జరిగితే.. అదో చిన్న విషయమన్న చంద్రబాబుకు, మేము ఇప్పుడు అదే కత్తి పంపిస్తాం. మరి దాన్ని పట్టుకుంటావా బాబూ? నువ్వు దాన్ని గతంలో ఎప్పుడైనా పట్టుకుని చూశావా? కాబట్టి మేం పంపిస్తాం. పట్టుకుని పదును పరిశీలిస్తే బాగుంటుంది. కోడి కత్తి తగిలి ఇద్దరు చనిపోయారని ఇటీవలే రామోజీరావు తన పత్రికలో రాశారు. అంత ప్రమాదకరమైన పదునైన ఆయుధంతో మా నాయకుడిపై దాడి చేస్తే దాన్నేదో తీసి పారేయాల్సిన విషయంగా చూస్తారా?
బాబూ నీ బతకుంతా నటన:
జగన్‌పై హత్యాయత్నంపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో లోతైన దర్యాప్తు అవసరమని, దాని వెనక అసలు కుట్రదారులెవరో తేలాలని ఆ ఘటనలో బాధితుడైన మా నాయకుడు కోరుతున్నారు. కానీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు, రోజుకోచోట పర్యటిస్తూ.. జగన్‌గారిపై హత్యాయత్నంపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. రాజకీయాల్లో అందరూ తన మాదిరిగా నటిస్తారని చంద్రబాబు అనుకుంటున్నాడు. మరి చంద్రబాబు తనపై సానుభూతి పెరగడం కోసం 2003లో అలిపిరిలో తనకుతానే దాడి చేయించుకున్నాడా? ఆ మాట మేం ఎప్పుడూ అనలేదు కదా? నిజంగా, ఆయన సానుభూతి కోసమే దాడి చేయించుకుంటే ప్రజలు ఆయనకు ఓట్లు కుమ్మరించాలి కదా? 2004 ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడు? అందుకే బాబు బతుకే పెద్ద నటన.
తీర్పులివ్వడానికి మీరెవ్వరు?:
జగన్‌గారిపై హత్యాయత్నంపై ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగుతుండగానే, నిందితుడి స్టేట్‌మెంట్ అంటూ చంద్రబాబు అండ్ కో ఇష్టానుసారం మాట్లాడుతుండగా, అదే విషయాన్ని పచ్చ పత్రికలు అదే పనిగా ప్రచురిస్తున్నాయి. అసలు నిందితుడు ఎన్‌ఐఏకు ఆ స్టేట్‌మెంట్ ఇచ్చాడనేది ఎంత వరకు కరెక్ట్? ఆ విషయం వాళ్లకు ఎవరు చెప్పారు? ఎన్‌ఐఏ వెల్లడించిందా? లేక నిందితుడే జైలు నుంచి ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చాడా? కేసు దర్యాప్తులో ఉండగానే తీర్పులివ్వడానికి మీరెవ్వరు? అలా రాయడానికి మీకేం హక్కు ంది?
ఎల్లో మీడియా వికృత పోకడలు:
తనపై హత్యాయత్నం జరిగిందని నిర్ధారణ అయ్యాక, దాని వెనుక ఎవరున్నారనేది తేల్చాలని జగన్‌గారు కోరుతున్నారు. దానికి చంద్రబాబు, ఎల్లోమీడియా ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు?. నిందితుడికి నేరచరిత్ర ఉందని తేలింది కదా? అలాంటప్పుడు నిందితుడికి ఎల్లో మీడియా ఎలా క్లీన్ చిట్ ఇస్తుంది. దాని ఆంతర్యమేంటి? అందుకే ఘటన వెనక కుట్ర ఉందని ఇప్పటికీ మేం గట్టిగా నమ్ముతున్నాం. కాబట్టి ఇకనైనా ఎల్లో మీడియా తన వికృత పోకడలు మానుకోవాలి.
అనుమానాలు వివృతి చేయాలి:
ఆరోజు కోడికత్తి మా నాయకుడి భుజానికి కాకుండా మెడకు తగిలి ఉంటే పరిస్థితి ఎంత ప్రమాదంగా ఉండేదో కుళ్లు, కుట్రలు చేసే వ్యక్తులు, వారికి వత్తాసు పలుకుతున్న ఎల్లోమీడియా ఒకసారి ఆలోచన చేయాలి. నేరచరిత్ర గలిగిన వ్యక్తికి విమానాశ్రయంలో ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? చిన్న సూదితోనైనా ఎవరైనా విమానాశ్రయం లోపలికి అడుగు పెట్టగలరా? మరి అలాంటప్పుడు ఒక వ్యక్తి ఏకంగా పదునైన కత్తితో ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లోకి ఎలా వస్తాడు? టీడీపీ సానుభూతిపరుడైన వ్యక్తి ఎయిర్‌పోర్టులో క్యాంటీన్ నడుపుతుంటే, నిందితుడు అక్కడ పని చేస్తున్నాడు. కుట్ర లేకపోతే, ఇవన్నీ సాధ్యమా? అందుకే మా అనుమానాలు నివృతి చేయాలి.
అబద్ధాల పుట్ట చంద్రబాబు
ఇటీవల చంద్రబాబు పర్యటనల్లో నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంత అబద్ధాల పుట్టగా ఉన్న చంద్రబాబును ముందెన్నడూ చూడలేం. అన్నీ నేనే తెచ్చానంటూ గొప్పలు చెప్పుకునే బాబు నిన్న భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడారు. ఎయిర్ పోర్టుకు కొబ్బరికాయ కొట్టింది నేనే అని చెప్పుకోవడానికి బాబుకు సిగ్గయినా ఉండాలి. బాబు కొబ్బరికాయ కొట్టేనాటికి భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూసేకరణే జరగలేదు. నిన్నటి దాకా కోర్టు వ్యాజ్యాలు నడిచాయి. ఆలూచూలు లేనిదానికి ఒక పది రూపాయల కొబ్బరికాయ కొట్టి చంకలు గుద్దుకోవడం బాబుకు అలవాటేనని చెప్పాలి. ‘అసలు, ఈరోజు పోలవరం ప్రాజెక్టు గురించి తెగ అరుస్తున్నావే.. పోలవరం ప్రాజెక్టుకు మొట్టమొదట శంకుస్థాపన చేసింది ఎవరు..? మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాదా..? మరి, ఎన్నిసార్లు నువ్వు శంకుస్థాపనలు చేశావు..? ఏదైనా అబద్ధం చెప్పడానికి సిగ్గుండాలి బాబూ..? ’
డీఎల్ నోరు అదుపులో పెట్టుకో:
బాబు అండ్ కో టీమ్‌లో భాగంగానే ఈమధ్యన ఒక అవుట్ డేటెడ్ æ పొలిటీషియన్ డీఎల్ రవీంద్రరెడ్డిని తెరమీదికి తెచ్చి ఆయనతో పిచ్చిగా మాట్లాడిస్తున్నారు. ఆయన ఇటీవల విజయమ్మ, షర్మిలమ్మ, భారతీగారి ్డ గురించి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు పేట్రేగి పోవడం మంచిది కాదు. రాజకీయాల్లో సీనియర్‌గా డీఎల్ మీదనున్న మర్యాద, గౌరవం ఇప్పుడు పోగొట్టుకున్నాడు. ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకుని స్పృహతో మాట్లాడితే మర్యాదగా ఉంటుంది.
భారతమ్మ పేరెత్తే అర్హత లేదు:
ఈరోజు మా ముఖ్యమంత్రి సతీమణిగా భారతీరెడ్డి ఒక తల్లిగా, గృహిణిగా, పారిశ్రామికవేత్తగా విజయవంతమైన మేటి మహిళగా ఉన్నారు. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని పెద్దలు చెప్పినట్లు మా సీఎం ప్రతీ విజయం వెనుక మా భారతమ్మ ఉన్నారు. రాజకీయాల గురించి ఏనాడూ పట్టించుకోని అలాంటి మహిళను విమర్శించడానికి డీఎల్ రవీంద్రరెడ్డికి కొంచెమైనా జ్ఞానం ఉండాలి. ఒక మహిళకు ఇచ్చే గౌరవం గురించి ఇప్పటికైనా తెలుసుకోవాలి. రాజకీయాల్లో కక్ష సాధింపులకు, కుట్రకోణాలకు వారి కుటుంబాల్లోని మహిళల్ని టార్గెట్ చేసుకుని విమర్శించడం మంచి పద్ధతి కాదు. రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మీ పిచ్చి ప్రేలాపనలన్నీ భరిస్తున్నారు. మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మా నాయకుడి మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయలేరు. మహిళల్ని గౌరవిస్తూ వారిపట్ల మర్యాదపూర్వకంగా ఉండే సభ్యత, సంస్కారం మా నాయకుడు మాకు నేర్పబట్టే మేము కూడా మీ ఇళ్లల్లో మహిళల గురించి మాట్లాడటం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు అండ్ కో టీమ్ ఈ విషయాన్ని గ్రహించి పిచ్చిగా వాగేవాళ్లందర్నీ కట్టడి చేస్తే మంచిదని హెచ్చరిస్తున్నాం.
అది జన నినాదం:
మేం ఇప్పటి వరకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాం. దీంతోపాటు ఈరోజు ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంతో కూడా నియోజకవర్గంలోని ప్రజలందర్నీ కలిసే అవకాశం దక్కింది. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పార్టీ కార్యకర్తలే గృహ సారథులుగా ఇంటింటికీ తిరిగి గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరిస్తున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తోన్న సీఎం సందేశాన్ని వివరిస్తున్నారు. పలు అంశాలపై సర్వేలతో ప్రజల అభిప్రాయాల్ని సేకరిస్తూ.. మా ప్రభుత్వానికి వారిచ్చే మద్ధతును తీసుకుంటూ.. ప్రజల కోరికమేరకు వారి గడపకు, మొబైల్ ఫోన్‌కు అంటించుకునే పార్టీ స్టిక్కర్లను పంపిణీ చేస్తూ విజయవంతంగా నడిపిస్తున్నాం. అందుకే తమ కార్యక్రమాలన్నీ ఒక జన నినాదం అని మాజీ మంత్రి కన్నబాబు వివరించారు.