Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో బీజేపీ నేతలపై దాడి చేసి ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటే కుదరదు

– అది పిరికిపందల చర్య
– సత్య కుమార్ మీద దాడిని ఖండించిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు

అమరావతికి మద్దతుగా అమరావతి వెళ్లిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీద “మందడం ” వద్ద దాడి చేయడం YSRCP గూండాల పిరికిపంద చర్య ! అమరావతికి మద్దతు ఇస్తే దాడులు చేస్తామంటే తిప్పికొట్టడానికి బిజెపి సిద్ధం. ఏన్ని దాడులు చేసిన అమరావతి రాజధానికి బిజెపి కట్టుబడి ఉంటుంది. ఓటమి అంచుల్లో వున్న జగన్ &కో దిక్కుతోచక బరితెగిస్తున్నారు. AP లో కార్యకర్తల మీద దాడులు చేసి కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకొంటాము అంటే కుదరదు. బిజెపి కార్యకర్తలను కాపాడుకొంటుంది . ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొంటాం.

LEAVE A RESPONSE