బిసి ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బిజెపి ఉమక్కకు ఇచ్చిన సీటును గుంజుకోవడం బాధాకరం
– బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు
– భారత రాష్ట్ర సమితిలో చేరిన బిజెపి సీనియర్ నాయకురాలు తుల ఉమ
బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు, మాజీ కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు., ప్రస్థుతం బిజెపి పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకురాలు తుల ఉమ నేడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తో వారి ఆహ్వానం మేరకు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం, తుల ఉమతో పాటు వారి ముఖ్య అనుచరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి కెటిఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..
‘‘ వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు బిజెపి టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, బిఫాం ఇవ్వకుండా ఇచ్చిన సీటును గుంజుకోవడం చాలా బాధాకరం. ఇది మహిళలకే కాకుండా బిసి ల పట్ల బిజెపి వ్యతిరేక వైఖరికి నిదర్శనం. బిసి ముఖ్యమంత్రిని చేస్తానని బిల్డప్ ఇచ్చిన బిజెపి పార్టీ., తెలంగాణ ఉద్యమ కాలం నాటినుంచి సీనియర్ మహిళా నాయకురాలుగా, నాడు సిఎం కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. తెలంగాణ ఆడ బిడ్డగా బిఆర్ఎస్ పార్టీ ఇంటిబిడ్డగా తన సేవలందించిన తుల ఉమక్క కు బిజెపి ఇటువంటి అవమానం జరగడం బాధగా వున్నది. బలహీన వర్గాల ఆడబిడ్డకు ఇటువంటి అన్యాయం జరగడాన్ని మీము తీవ్రంగా ఖండిస్తున్నాము..నిరసిస్తున్నాము.
సిఎం కేసీఆర్ సూచనమేరకు స్వయంగా నీనే ఉమక్కకు ఫోన్ చేసి ఆహ్వానించిన. మా ఇంటి ఆడబిడ్డగా గులాబీ గూటికి తిరిగి చేరుకోవాలనే నా ఆహ్వానాన్ని మన్నించి రావడం సంతోషం. తుల ఉమక్క కు గతంలో వున్న హోదాకంటే కూడా మరింత సమున్నత హోదాను, బాధ్యతలను అప్పగించి పార్టీ గౌరవించుకుంటుంది. ఇందుకు సంబంధించిన బాధ్యతను స్వయంగా నీనే తీసుకుంటాను.
కేసీఆర్ నాయకత్వంలో నిబద్దత కలిగిన సైనికురాలిగా ఎలాంటి కల్మషం లేకుండా కలిసి పనిచేసిన తుల ఉమ గారితో అంతే నిబద్థతో తిరిగి కలిసి పనిచేస్తాం. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని మహిళా అభ్యున్నతికోసం అక్క సేవలు అవసరం. గతంలో కూడా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళాభ్యున్నతికోసం కృషిచేసిన తుల ఉమక్కకు పుట్టిన గూటికి పున: స్వాగతం’’ అని మంత్రి కెటిఆర్ అన్నారు.
బిజెపి పార్టీ లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండరు: తుల ఉమా
నాకు ఎం.ఎల్.ఏ టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి దొంగ దారిన ఇంకొకరికి ఇచ్చారు.బిజెపి లో బిసి ముఖ్యమంత్రి చేయడం అనేది ఒక కల మాత్రమే…అందుకు ఉదాహరణ నేనే.నాకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి. బిజెపి అగ్రవర్ణాల పార్టీ.కేవలం కింది స్థాయి కార్యకర్తలను మాత్రమే వాడుకుంటుంది.గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ లో మొదటి నుండి ఉన్నాను..అనేక హోదాల్లో పని చేసాను ఇక్కడ ఇచ్చిన గౌరవం బిజెపి పార్టీలో ఇవ్వలేదు. అందుకే దయచేసి బిజెపి కార్యకర్తలారా ఆగం కాకండి.. వారు కేవలం రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవలనుకుంటున్నారు.. దయచేసి బిజెపి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది.మధ్యలో కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ తిరిగి నా సొంత గూడు అయినటువంటి బి.ఆర్.ఎస్ పార్టీ లోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అదే ఉత్సాహం తో భవిష్యత్తులో బి.ఆర్.ఎస్ పార్టీ కి పని చేస్తాం.