టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్
కెసిఆర్ ను ఫామ్ హౌస్ కు, జగన్ ను ఇంటికి సాగనంపడం ఖాయమని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ నాతాల రామ్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ నుంచి వాణిజ్య భవన్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపి మాట్లాడారు. స్కిల్ డెవలప్ మెంట్ పథకంలో అవినీతి జరిగిందని నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా దోషిగా ధృవీకరిస్తూ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
జగన్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయించారని తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి కృషిచేసిన గొప్ప నాయకుడిని అరెస్టు చేయించి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో రాక్షస పాలన నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం వహించడం సరికాదన్నారు.
గతంలో టిడిపి ఇచ్చిన రాజకీయ భిక్షనే ఈరోజు సీఎం కేసీఆర్ ను చేసింది అనే విషయం మర్చిపోయి మౌనం వహిస్తున్నారని అన్నారు. అంతిమంగా నారా చంద్రబాబునాయుడు నీ ధర్మం గెలిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధరావత్ వెంకన్న నాయక్, గాజుల వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, చిట్టి పల్లి సైదులు, గోవిందా చారి, జనార్ధన చారి, తదితరులు పాల్గొన్నారు.