Suryaa.co.in

Telangana

ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగ

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద నుండి జరిగిన జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించి, పాల్గొన్న రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి .

బాన్సువాడ: ర్యాలీలో పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి ,అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ , RDO రాజా గౌడ్ మరియు నియోజకర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యార్థులు, మహిళలు, రైతులు, ప్రజలు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ… భారతదేశానికి ఆగస్టు 15, 1947 న వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చే నాటికి దేశంలో 584 సంస్థానాలు ఉన్నాయి.అయితే తెలంగాణ తో పాటుగా, మహారాష్ట్ర, కర్ణాటక లోని ప్రాంతాలకు మాత్రం సెప్టెంబర్ 17, 1948న స్వాతంత్య్రం వచ్చింది.నాటి దేశ హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ వచ్చి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేశారు.ఇటీవలే భారతదేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు 15 రోజుల పాటు ఘనంగా జరుపుకున్నాం.

మన ప్రాంతానికి స్వాతంత్ర్యం వచ్చిన రేపటి సెప్టెంబర్ 17 నుండి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను, సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈరోజు వేలాది మందితో ర్యాలీ నిర్వహిస్తున్నం.రేపు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల వద్ద జెండాలు ఎగురవేస్తాం.18 న స్వాతంత్ర్య సమరయోధులు, కళాకారులను సన్మానించడం జరుగుతుంది.తదుపరి ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతాయి.

ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల పండుగఇది కేవలం ఒక కులానికో మతానికో సంబంధించినది కాదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్ధ నాయకత్వం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.దేశం నివ్వెరపోయేలా ప్రగతి సాగిస్తున్నది.

ప్రక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల ప్రజలు తమను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతున్నారు.రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంటు ఉన్నాయి. మద్దతు ధర తో ధాన్యం కొనుగోలు జరుగుతున్నాయి.ఇతర రాష్ట్రాల లో కరువు పరిస్థితులు ఉన్నాయి.వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్.

ఈమధ్యనే నూతనంగా మరో 10 లక్షల పెన్షన్లు మంజూరు చేశాం.దేశంలోనే అత్యధికంగా 45 లక్షల మంది పేదలకు పెన్షన్లను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ..మిగతా రాష్ట్రాలలో రూ. 500, రూ.1000 అందిస్తే మన దగ్గర రూ. 2000, రూ. 3000 అందిస్తున్నం.విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి 230 ఉన్న గురుకుల పాఠశాలలను 1000 కి పెంచాం..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా ఉన్నాం.

తెలంగాణ రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండడమే లక్ష్యం.రాష్ట్రంలో సంపదను పెంచి ప్రజలకు పంచుతున్నాం.65 లక్షల మంది రైతులకు రూ. 15000 కోట్లు రైతుబంధు ఇస్తున్నాం.45 లక్షల మందికి ఆసరా పెన్షన్ ల ద్వారా రూ. 15,000 కోట్లు అందిస్తున్నాం.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ల ద్వారా రూ. 9000 కోట్లను పదమూడు లక్షల మంది కి అందజేశారు.కేసీఆర్ కిట్ 11 లక్షల మందికి రూ. 6000 కోట్లు ఇచ్చాం.మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ త్రాగునీరు అందిస్తున్నం.

తెలంగాణ రాష్ట్ర కొత్త సెక్రటేరియట్ కు రాజ్యాంగ నిర్మాత, బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టుకుని వారిని గౌరవించుకున్నాం. భారత పార్లమెంట్ కు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశాం. పెద్దలు, మహానుభావుల ఆశిర్వాదంతో తెలంగాణ రాష్ట్ర పరిపాలన సాగుతోంది.

LEAVE A RESPONSE