Home » సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

తెలంగాణా ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు ఖరారు చేయడం పట్ల ఉప సభాపతి పద్మారావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సితాఫలమండీ లోని ఎం ఎల్ ఏ క్యాంపు కార్యాలయం వద్ద కార్పొరేటర్లు, నేతలతో కలిసి బాబా సాహెబ్ చిత్ర పటానికి, సీ ఎం కే సీ ఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నివహించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందుబాటులోకి వచ్చేలా అంబేద్కర్ కృషి చేసిన మహానీయుడని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కే సీ ఆర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను నిరంతరం గుర్తుంచుకొనేలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేటర్లు రాసురి సునిత, లింగాని ప్రసన్న లక్ష్మి, సామల హేమ, కంది శైలజ, నేతలు మోతే శోభన్ రెడ్డి, కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, లింగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply