అడ్డమీది కూలీలా ఆర్మీ తయారయ్యే పరిస్థితి

-చెంచల్ గూడ జైల్ నుంచి రేవంత్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ,మోడీ ఆనాలోచిత నిర్ణయాల వల్ల దేశ భధ్రతను, యువత భవిష్యత్ ను పనంగా పెట్టారు. దేశ స్వాతంత్ర్యానంతరం 60వేల మంది యువకులను అన్ని ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం ఆర్మీ లో రిక్రూట్ మెంట్ చేసారు. పార్లమెంట్ లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుని ఉంటే..ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు . ఆర్మీ లో రిటైర్మెంట్ తర్వాత.. ఉధ్యోగ భధ్రత ఉండేది.కానీ నాలుగు సంవత్సరాలకోసం రిక్రూట్ చేసే విధానాన్ని హడావిడి గా నిర్ణయం తీసుకున్నారు.దేశ భధ్రత కు ముప్పు ఏర్పడుతుందనే…దేశ యువత ఆందోళన లు చేస్తోంది. అడ్డమీది కూలీలా ఆర్మీ తయారయ్యే పరిస్థితి ఉంది. భవిష్యత్ భధ్రత లేకుండా అగ్నిపథ్ తీసుకొచ్చారు.

రెండు సంవత్సరాల ట్రైనింగ్ లో నేర్చుకోవాల్సింది..6 నెలల ట్రైనింగ్ ఇస్తే.. సమర్దులు అయిన ఆర్మీ ఆఫీసర్ ఎలా తయారవుతాడు? ఉధ్యోగ భధ్రత లేకపోతే..దేశ భధ్రత కు ప్రమాదం ఏర్పడుతుంది.దేశ భధ్రత దృష్ట్యా అగ్నిపథ్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని .గతంలో పరీక్ష రాసిన ఆర్మీ అభ్యర్థులకు వెంటనే తదపరి పరీక్షలు పెట్టి ..రిక్రూట్ చేయాలి.

2020లో నోటిఫికేషన్ ఇచ్చి ఇంతవరకు ..రాత పరీక్ష పెట్టలేదు. ఆర్మీ అభ్యర్థులలో ఎక్కువ మంది యస్సీ ,యస్టీ ,బీసీ పిల్లలే ఎక్కువ.జైల్లో రిమాండ్ లో ఉన్న వారికి సంబంధించి చాలా మంది తల్లిదండ్రులకు వారి పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియదు.హత్యాయత్నం కేసు లు నమోదు చేశారు.భవిష్యత్ లో ఉధ్యోగాలుrevanth1 రాకుండా నాన్ బెయిల్ కేసులు పెట్టారు.మేము ఎటువంటి విధ్వంసాలకు పాల్పడలేదని రిమాండ్ లో ఉన్న ఆర్మీ అభ్యర్థులు చెప్తున్నారు.ఇంతమంది పై ఇంత గుడ్డిగా 307ఐపీసీ కేసు ఎలా పెడతారు?చాయ్ అమ్ముకునే వ్యక్తి ని ప్రధాని ని చేస్తే..దేశ యువతకు నరేంద్ర మోడీ ఇచ్చే నజరానా ఇదేనా?అగ్నిపథ్ ను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుంది.ఆర్మీ అభ్యర్థుల పై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి.

కేసీఆర్ నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. గోపాలపురం పోలీస్ స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థుల పై రెండు కేసులు నమోదు చేశారు.రాకేష్ మరణం పై టిఆర్ఎస్ రాజకీయం చేసింది.రాకేష్ మరణం పై మోసలి కన్నీరు కార్చిన టిఆర్ఎస్.. ఆర్మీ అభ్యర్థుల పై ఎందుకు కేసు లు పెట్టారు? కేసులు అయిన ఆర్మీ అభ్యర్థులకు కాంగ్రెస్ న్యాయ సహాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు ఉపసంహరించడంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ సహాయం అందించాలి. రైల్వే పోలీసులు స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసి..40 రోజులలో తక్షణమే కేసులు ముగించాలి. పార్లమెంట్ సమావేశాల్లో అగ్నిపథ్ ను ప్రస్తావిస్తాం. ఈనెల 27న అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాం..

Leave a Reply