Suryaa.co.in

Features

శాశ్వత రూపం కల్పిస్తుంది అక్షరమే..

మనిషి జీవితం అశాశ్వతమైన
అక్షరం శాశ్వతమై కీర్తినిస్తుంది
అమృతం త్రాగ కున్న మనిషికి
అమరత్వమై నిలుస్తోంది అక్షరం..!!

రూపం కల్పించి ఆరాధించే మనిషిని
క్షరము లేని అక్షరం ఎప్పుడూ జ్వలిస్తూ
పంచభూతాలకు అతీతమై నిలుస్తూ
యుగాలుగా మారిన సత్యంలా వెలుగుతుంది..!!

ఎల్లలు ఎరుగని ప్రేమ అక్షరంలో నిక్షిప్తం
అనుబంధాలను నిరంతరం పెంచుతూ
నేల మీద శాశ్వతంగా ప్రయాణం కొనసాగిస్తూ
మనిషిని అక్షర రూపంలో చిరస్థాయిగా నిలిపే..!!

కాలానికి సాక్షీ భూతంగా అక్షరమే కర్తగా ఉంటూ
చరిత్ర మైళ్ళ రాళ్ళకు ప్రాణప్రతిష్ట చేసింది
అనాది నుండి నేటి ఆధునిక యుగం వరకు నిలిచి
చరిత్రను మార్చటానికి లేకుండా చేసింది అక్షరమే..

సమస్త సృష్టికి మూలమైన శక్తి అక్షరం దగ్గరే
శ్లోకంతో కరుణ రసము ఒడిసి పట్టింది
ఆనందం దుఃఖాలను అందరికీ పంచుతూ
ధరణి పైన దర్జాగా శాశ్వతంగా జీవిస్తుంది…!!

ఆలోచనల స్వప్నాలను అందంగా మలుస్తూ
ఊహా లోకంలో భావాలను వర్ణిస్తూ
వాస్తవ సత్యాలను ఆహ్వానంగా పంపుతూ
రాసే ప్రతి వ్యక్తికి అమరత్వాన్ని ప్రసాదిస్తుంది..!!

– కొప్పుల ప్రసాద్
నంద్యాల

LEAVE A RESPONSE