-గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు మాటలే లేవు
-బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్
తెలంగాణ శాసనసభలో గవర్నర్ గారి తొలి ప్రసంగం నిరుత్సాహపర్చింది. వాస్తవానికి దూరంగా కేవలం పొగడ్తల కోసమే కాంగ్రెస్ పార్టీ పాకులాడింది. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా స్పష్టత లేకుండా గవర్నర్ ప్రసంగం రూపొందించారు. గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు ఊసే లేదు.
ఆరు గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత లేదు.గవర్నర్ ప్రసంగం చూస్తే హామీల అమలుపై అనుమానాలు ఉన్నాయి. గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీ, రైతుబంధు మాటలే లేవు. మొదటి కేబినెట్ సమావేశంలోనే మెగా డీఎస్సీపై ప్రకటన అన్నారు.. ఏమైంది? హామీల అమలుకు కొత్త ప్రభుత్వానికి వంద రోజులు సమయం ఇచ్చి.. ఆపై ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం.