– ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, దైవ సంకల్ప దృష్టి
దైవ సంకల్పమే ఈ దార్శనికత! లిప్తకాలంలోనే డిజైన్ చూసి, మెరుపు వేగంతో సూచనలు ఇచ్చే నాయకుడు. వెయ్యి మందికి అన్నప్రసాదం కోసం కట్టినా, రేపటి ఇరవై వేల మందిని దృష్టిలో పెట్టి పునాది వేయమని ఆదేశం. “అన్నీ ఒకే దశలో, ఒకేసారి పూర్తి చేయాలి” – వేగం, పట్టుదల, స్పష్టత కలిసిన ఆదేశం. తిరుమల తరహాలో పవిత్ర నిర్మాణాలు, కృష్ణమ్మ ఒడ్డున నిత్య హారతి, 50 కాటేజీలు, నిత్య భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు – అన్నీ భక్తి + భవిష్యత్తు కలిసిన ప్రణాళిక.
ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, దైవ సంకల్ప దృష్టి. అమరావతి ఆలయం రాజధానికి ఆధ్యాత్మిక ఆకర్షణగా నిలిచేలా, ప్రపంచ స్థాయి సంస్కృతి + సంప్రదాయాలను నదీ తీరాలతో అనుసంధానం చేసే దూరదృష్టి. భవిష్యత్ ఆంధ్రకు భగవంతుడు అలిపిరిలో ఊపిరిపోసి పంపిన శిల్పి… ఆయన వేసే ప్రతి అడుగు దేవుని ఆశీస్సులతో కూడినది! ఆయన సంకల్పం శాసనం. కలియుగ వైకుంఠం ఏడుకొండల నుండి భువిలోని తమ రాజధాని అమరావతికి వచ్చి రథంలో ఊరేగుతూ చూసి ఆనందించాలని స్వామి సంకల్పం ఏమో! భక్తుడితో అవన్నీ తానే చేయించుకుంటున్నారు.
ప్రపంచ నలుమూలల నుండి అమరావతికి వచ్చే వారికి అక్కడే దర్శనం ఇచ్చి ఆశీర్వదించి పంపాలనే తపన ఏమో ఆ నారాయణుడిది. తన పాదాల చెంత పెరిగిన నారావారి పల్లె నారా చంద్రుడిని ఆ నగరానికి పంపాడు అనిపిస్తోంది. ముందుగా తనకు భద్రాచలం ఆలయం కట్టిన రామదాసును గోల్కొండలో బంధించిన హైదరాబాద్ ఇచ్చి, పరీక్షించి, ఈ అమరావతి నగరాన్ని మయుడు నాయుడికి ఇచ్చినట్లున్నాడు నారాయణుడు.

