– జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి పీఏ ఆదేశాలు!
“కల్తీ నెయ్యి! అది కూడా లడ్డూకి!” అని నివేదిక చెప్పినా, అధికారి సుబ్రహ్మణ్యం ఏమాత్రం చలించలేదు. ఎందుకంటే, ఆయనకు దిశానిర్దేశం చేయడానికి సాక్షాత్తూ వైవీ సుబ్బారెడ్డి గారి పీఏ చిన్నప్పన్న గారే రంగంలో ఉన్నారు! టెండర్లలో అర్హత లేదని, ప్రమాణాలు పాటించడం లేదని సాంకేతిక కమిటీ రిపోర్ట్ ఇచ్చినా… పీఏ గారి పదే పదే ఫోన్ కాల్స్ ముందు ఆ రిపోర్టు నిలబడలేకపోయింది. ఒక డెయిరీ ప్లాంట్‌ను తనిఖీ చేసేందుకు ఉత్తరప్రదేశ్‌కి వెళ్లిన అధికారికి, లడ్డూ తయారీలో వాడాల్సిన నెయ్యి కంటే, పీఏ గారి ఆదేశాలే ఎక్కువ ముఖ్యమాయె! అసలు ఆ చిన్నప్పన్న గారి దగ్గర తితిదేకు నెయ్యి సరఫరా చేసే డెయిరీల ప్రతినిధుల నంబర్లు ఉండడం, వారితో సంభాషించడం… ఇదంతా చూస్తుంటే, ఆయనకే నెయ్యి వ్యాపారంలో ‘ప్రత్యేక ప్రొక్యూర్మెంట్ విభాగం’ ఉందేమో అనిపిస్తోంది.
తిరుమల లడ్డూ పవిత్రతను కాపాడాల్సిన తితిదే జీఎం సుబ్రమణ్యం సిల్వర్ ప్లేట్ తళతళకు, ఏభై వేల సెల్‌ఫోన్, 3.5 లక్షల లంచానికి లొంగిపోయారు. – మైసూరు ల్యాబ్ ఇచ్చిన కల్తీ నెయ్యి నివేదికను కాగితాల గుట్టలో దాచేశారు. – “వెజిటబుల్ ఆయిల్ కలిసింది” అన్న సాక్ష్యం, బీటా సిటోస్టెరాల్ పాజిటివ్ అన్న ఫలితం, అన్నీ పక్కన పెట్టి డెయిరీ మాఫియాకు రెడ్ కార్పెట్ వేశారు. లంచం లెక్కలు: – రూ.3.50 లక్షల నగదు – రూ.50 వేల విలువైన మొబైల్ ఫోన్ – రూ.16,700 వెండి ప్లేటు – 50 గ్రాముల వెండి నాణెం ఇవన్నీ తీసుకుని, “లడ్డూ పవిత్రత”ను కల్తీ నెయ్యిలో ముంచేశారు. సుబ్రహ్మణ్యం – కల్తీ నెయ్యి జీఎం – టెండర్లలో అర్హత లేని డెయిరీలకు “అర్హత ఉంది” అని తప్పుడు నివేదికలు. – సాంకేతిక కమిటీ సభ్యుడిగా తనిఖీలు చేయకుండా, కల్తీకి కవచం. – “లడ్డూ పవిత్రత”ను లంచం పవిత్రతగా మార్చిన ఘనత. అయినా బాబాయ్ సుబ్బారెడ్డి తాను పవిత్రుడినని, తనకు పీఏ కాదని, దర్యాప్తు మీద మీడియా ద్వారా జడ్జిమెంట్లు ఇస్తూ ఇంకా సుభాషితాలు చెబుతూ దులిపేసుకుంటున్నారు.
– చాకిరేవు