– భూ ఆక్రమణల ఫలితంగానే బుడమేరు వరద ఉధృతి
– ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలి
– వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 20 వేలు తక్షణ సహాయం అందించాలి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
నందిగామ, జగ్గయ్య పేట: వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించాలని, వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 20 వేలు తక్షణ సహాయం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. అధికారులు సమన్వయ లోపం తోనే వరద ఉధృతి నీ అంచనా వేయలేక ప్రజానీకం స్తంభించింది అన్నారు.
నందిగామ కుమ్మరి బజార్ లో నీట మునిగిన పలు కుటుంబాలను నిత్యవసర వస్తువులు సర్టిఫికెట్లు పుస్తకాలు అన్నీ తడిసిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం 25 కేజీల కందిపప్పు ఇతర నిత్యవసర వస్తువులను అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
మరణించిన కుటుంబాలకు 10 లక్షలు నష్ట పరిహారం చేయాలని, జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగ్రంచిపోలు ముచ్చింతల వద్ద మురారి నాది గండిని మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం తో కలసి పరిశీలించి పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.
వరద వల్ల నష్టపోయిన వాణిజ్య పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున ఇతర పంటలకు తక్షణసాయంగా 30 వేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై దృష్టి సారించాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో సిపిఐ శ్రేణులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, కార్యదర్శి నక్కి లెనిన్ బాబు సిపిఐ సీనియర్ నాయకులు బెల్లంకొండ బ్రహ్మం, సిపిఐ నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు, పొన్నం నరసింహారావు, కట్ట చామంతి, మన్నే హనుమంతరావు, పేయ్యాల .వెంకటేశ్వరరావు, జి దేవరాజు తదితరులు పాల్గొన్నారు.