Suryaa.co.in

Andhra Pradesh

వరద బాధితులకు ఒక రోజు జీతం విరాళం

– రాష్ట్ర జేఏసీ నేతల వెల్లడి

అమరావతి: వరద పరిస్థితులు నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబర్ నెల జీతం నుంచి ఒక్కరోజు బేసిక్ పే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, సెక్రటరీ జనరల్ పి.హృదయ రాజు బుధవారం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ యుటిఎఫ్ అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు, ఎస్ టి యు ప్రధాన కార్యదర్శి రఘునాథ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ ఎ. విద్యాసాగర్, క్యాపిటల్ సిటీ అధ్యక్షుడు నాగభూషణం, రాష్ట్ర ఎన్జీవో నాయకుడు జగదీష్, రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రభుదాసు, పిఏ ఓ ఉద్యోగుల అధ్యక్షుడు హరినాథ్ బాబు, గ్రామ సచివాలయ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జానీ భాష, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఏ సాంబశివరావు, పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర, అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేణుమాధవ్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE