Suryaa.co.in

Telangana

కె.సి.ఆర్ వల్లే తెలంగాణకు స్వేచ్ఛ,స్వపరిపాలన సిద్ధించింది

ప్రజా సంక్షేమమే పరమావధిగా కె.సి.ఆర్ పాలన సాగింది.
బి.ఆర్.ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో
మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: కె.సి.ఆర్ నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ నందు జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం జరిగింది.

రీగా తరలివచ్చిన కార్యకర్తలకు నిరంజన్ రెడ్డి దిశ నిర్దేశం చేస్తూ.. రజతోత్సవ సభను విజయవంతం చేయుటకు గ్రామగ్రామాన సమావేశాలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలను,ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25 ఏండ్ల బి.ఆర్.ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్పూర్తి కలిగించాలని కోరుకున్నారు.

తెలంగాణ ఆస్తి కె.సి.ఆర్ అని, 14 ఏండ్ల ఉద్యమ చరిత్ర,10ఏండ్ల అధికారంలో తెలంగాణ కె.సి.ఆర్ నాయకత్వములో సుభిక్షంగా మారిందని కొంతమది కుట్రలు కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయిన ప్రజలలో అభిమానం తగ్గలేదని, అధికార కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని కె.సి.ఆర్ విలువ బి.ఆర్.ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చింది అని అన్నారు.

20 రోజులలో నాయకులు మండల,గ్రామ సమావేశాలు పార్టీ పతాక ఆవిష్కరణ చేసి సభ విజయవంతం చేయుటకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎల్లపుడు ప్రజల మధ్యన ఉండి వారి సమస్యలలో పాలుపంచుకోవాలని అటువంటి నాయకులకే పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రజతోత్సవ సభ విజయవంతంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు రైతు బంధు రైతు రుణ మాఫీ రైతు భరోస,మహిళలకు 2500,తొలం బంగారం,నిరుద్యోగ భృతి వంటి అంశాలు ప్రజలకు వివరించాలని అన్నారు.

రజతోత్సవ సభ విజయవంతంతో రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు వస్తాయని సకల జనులు బి.ఆర్.ఎస్ వైపు చూస్తారని నిరంజన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE