Suryaa.co.in

Andhra Pradesh

రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు

-వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది
-నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి

వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నారా భువనేశ్వరి విమర్శించారు. శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలో పార్టీ కార్యకర్తలు కేశినేని వెంకటేశ్వర్లు, కందుకూరి నరసింహాచారి కుటుంబాలను నిజం గెలవాలి యాత్రలో భాగంగా శుక్రవారం పరామర్శించారు. కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంతమందిని అక్రమంగా జైలులో బంధిం చినా, ఎన్ని విధాలుగా వేధించినా భయపడకుండా పసుపు జెండాను ఎగరేసిన ప్రతి కార్యకర్తకు పాదాభివం దనాలు తెలిపారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా మారింది. రాష్ట్ర విభజన అనంతరం ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలని చంద్రబాబు పరితపించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో అమరావతి రైతులు రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను అపహాస్యం చేసింది. మూడు రాజధానుల పేరుతో అమరావతి నిర్మాణాన్ని కుప్పకూల్చింది. అడ్డుకున్న రైతులను పోలీసులతో కొట్టించి, దళిత రైతుల చేతులకు బేడీలు వేయించి జైళ్లకు పంపి, మహిళా రైతులను కొట్టి ఈడ్చి పారేశారని విమర్శించారు.

మూడు రాజధానులు కడతామని అని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఈ దేశంలోనే ఏపీనీ రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలబెట్టిందని దుయ్యబట్టారు. రాయలసీమను సస్య శ్యామలం చేసేందుకు అన్న ఎన్టీఆర్‌ తెలుగు గంగ ప్రాజెక్టును నిర్మించారు…. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్వహించడంలో విఫలమైందన్నారు. నారాయణ అనే టీడీపీ కార్యకర్త చంద్రబాబుకు సంఫీుభావం తెలిపినందుకు కాలి నడకన శ్రీశైలం నుంచి రాజమండ్రికి బయలుదేరినప్పుడు మార్గం మధ్యలో వైసీపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారని ఇలా అనేక మందిని వైసీపీ గూండాలు అడ్డుకోవాలని చూసినా వాళ్ల వల్ల కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE