(కృష్ణయ్య)
విధ్వంసం…విద్వేషం…వికటాట్టహా సం,
వినాశకం…అమానుషం…అతని దరహాసం.!
కుతంత్రముల కుటిల క్రూర దుశ్శాసన పర్వం.
నియంతృత్వ నిరంకుశపు అహంకార గర్వం!
రాజధాని రద్దుచేసె రాజ్య రాక్ష సత్వం.
రాబందుల బంధు వర్గ దోపిడీల తత్వం.!
పోలవరం ముంచినట్టి పోడు మనస్తత్వం.
ఓటు కొరకు సీటు కొరకు కాళ్లు పట్టు యత్నం.!
ఎదిరిస్తే వెంటాడే యమ కింకర వ్యూహం.
ఎదురులేని వాడి వలె వుండాలని మోహం.!
గనులు..గిరులు మద్య సిరులు మొత్తంగా స్వాహా ,
భూమి,శక్తి యుక్తి మేర మేయు రక్తి ఆహా!
గగన సీమ ఎగురు చున్న ఆంధ్ర ప్రగతి కూలె,
రైతు,కూలి ,వుద్యోగి పట్ట సాగిరి జోలె!
ఏమి ఖర్మ, ఏమి ఖర్మ ఆంధ్ర దేశ జనమా ?
ఒక్క సారి ఓటు వేసి తెచ్చుకున్న విషమా !
మేలుకొనుము; మానుకొనుము చాదస్తపు అభిమతం,
ఆంధ్ర జాతి అభివృద్ధికి కట్ట వలెను కంకణం.!
ఓటు వేసి పట్టు నీవు మంచి చేయు చేయి,
కులం మతం చూసి మళ్ళీ తవ్వు కోకు గొయ్యి.!