– తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
గుంటూరు: వర్షాలకు రాజధాని మునిగిపోయిందని విష ప్రచారం చేస్తున్నారు… మాజీ మంత్రి అంబటి రాంబాబు… 2014లో కొండవీటి వాగు 13 లక్షల రూపాయలతో చప్టా నిర్మించాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిధులను ఆపేశారని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విమర్శించారు. అయిదేళ్ళ రాజధాని పై కక్ష కట్టి అభివృద్ధి జరపలేదు. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు మీరు ఎందుకు అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. వర్షం కురిసినప్పుడు నీరు నిల్వ ఉండడం సహజం. మునిగిపోయేది రాజధాని కాదు వైసీపీ మునిగిపోయే పరిస్థితి లో ఉంది. మీరు చేసిన అవినీతికి జైల్లు కూడా సరిపోవట్లేదు.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ అంబటి రాంబాబు కి ప్రజా తీర్పులో బుద్ధి చెప్పిన ఇంకా బుద్ధి రాలేదు. 2019 నుండి వైసీపీ పాలనలో అమరావతిని భ్రమరావతి అన్నారు. అప్పటిలో ఎన్ని కేసులు పెట్టిన ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారు. వైసీపీ ప్రభుత్వం లో వరదలు వచ్చి రైతులు నష్టపోలేదా?
అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు రైతుల పై మొసలి కన్నీరు కారుస్తున్నారు. రాజధానిలో మురుగు నీరు తరలిస్తే పొన్నూరు మునిగి పోయిందని విష ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నాయకులకు అమరావతి రాజధాని పై ఇంకా ద్వేషం పోలేదు. ఇరిగేషన్ మంత్రి గా ఉన్నప్పుడు పొన్నూరు కి ఎందుకు నిధులు కేటాయించలేదు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాం.
గుంటూరు ఛానెల్ పై ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావ్. అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి గా ఉన్నప్పుడు గుంటూరు ఛానెల్ అభివృద్ధి కి వాటాల కోసం టెండర్లు పిలవకుండా మధ్యలో ఆపేశావ్. కొండవీటి వాగు లో ఉన్న నీరు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కృష్ణ నదికి తరలించారు. అంబటి మురళి రైల్వే పర్మిషన్ లేకపోయినా నువ్వు ఫ్లాట్ లు అమ్మి వినియోగాదరులను మోసం చేశావ్. జిల్లాలో ఇంరిగేషన్ మంత్రి గా ఉండి జిల్లా కి ఏమి చేయలేని అంబటి రాంబాబు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.