Suryaa.co.in

Andhra Pradesh

ఒకటవ తేదీ జీతాలు పొందటం మా హక్కు – ఇవ్వడం ప్రభుత్వ భాద్యత

APJAC రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు
– బాపట్ల జిల్లాలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ, 9వ రోజు

ఏ రోజైతేమి, ఉద్యోగస్తులకు జీతాలిస్తున్నామా -లేదా? అని ఒక భాద్యత లో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ వాఖ్యనించడము చాలా శోచనీయం, ఉద్యోగస్తులకు ఒకటవ తారీకు జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వ భాధ్యత . ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వమే అచరించకపోతే మిగిలిన వాళ్ళు ఎలా పాటిస్తారు. ఒకటవ తారీకు జీతం పొందడం మా హక్కు. సకాలంలో జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత ఈ భాధ్యాతలను ప్రభుత్వం సక్రమంగా నిర్వహించగపోగా, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వలన ఉద్యోగుల మనోభావాలు తెబ్బతీస్తాయనీ APJAC రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు అన్నారు.

ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పనిచేస్తున్న ప్రభుత్వ “ఉద్యోగులతో చేయి చేయి కలుపుదాం” కార్యక్రమం” – 26 జిల్లాలను కవర్ చేసేలా 6-టీములతో రాష్ట్ర పర్యటన చేస్తున్నామని, ఆ పర్యటన ద్వారా AP జేఏసీ అమరావతి ఉద్యమానికి దారి తీసిన పరిస్థితులు – ఉద్యోగుల పాత్ర – భవిష్యత్ కార్యాచరణ గురించి ఆయా ఉద్యోగులకు తెలియచేస్తున్నామని బొప్పరాజు తెలిపారు. అందులో భాగంగా, ఈ రోజు బాపట్ల జిల్లాలో APJAC అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈరోజు బాపట్ల కలెక్టర్ కార్యాలయం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడమైనది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా APJAC అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…ఉద్యోగుల పెండింగ్ DA , PRC మరియు ఇతర పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీని అమలు చేసి CPS పెన్షన్ పధకంను రద్దు చేసి రాష్టఉద్యోగులు అందరికి OPS పెన్షన్ పధకాన్ని అమలు చేయాలనీ ఇంకా ప్రభుత్వం మాకు కేటాయించిన బడ్జెట్ లోని మొత్తాలను ప్రభుత్వం మాకు సకాలంలో ఎందుకు చెల్లించదు అని ప్రశ్నించారు.

భద్రతగా ఉంటుందని ప్రభుత్వం వద్ద దాచుకున్న డబ్బుల్ని కూడా మాకు ఇవ్వకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఈ సందర్భంగా ఆవేదన చెందారు. అలాగే ఈ సందర్భంగా, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్.మల్లేశ్వరరావు, VRO అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.సాంబశివరావు తదితరులు కూడా హాజరైన ఉద్యోగులు తో మాట్లాడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఉన్న జిల్లా రిజిస్ట్రార్, కెకలెక్టర్ వారి కార్యాలయం, జిల్లా ఖజానా కార్యాలయం జిల్లా ఆడిట్ కార్యాలయం, సర్వే శాఖ, DRDA, డ్వామా, DPO తదితర కార్యాలయాల సిబ్బంది హాజరైనారు తదుపరి బాపట్ల తహసీల్దార్ కార్యాలయము, ఆర్ట్స్ కాలేజి, కో ఆపరేటివ్ తదితర డిపార్ట్మెంట్ కార్యాలయలను సందర్శించి ఉద్యమ అవసరాన్ని తెలియచేసి నల్లబ్యాడ్జీలు దరింపచేసి నినాదాలు ఇస్తూ నిరసన ప్రదర్శనలు చేసి ఉద్యోగులకి మన న్యాయమైన సమస్యలు పరిష్కారానికి మాత్రమే మనం ఉద్యమం చేస్తున్నామని ప్రజాస్వామ్యంలో ఉద్యమం మన హక్కుని మనకు రావాల్సిన ఆర్థికపరమైన చెల్లింపులు మరియు ఇతర సమస్యలు పూర్తిగా నెరవేర్చే వరకు ఈ ఉద్యమము ఆగదని ప్రతి ఒక్క ఉద్యోగి చిత్తశుద్ధి తో ఉద్యమకారాచరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో APJAC జిల్లా చైర్మన్ రాజా రమేష్ మోహన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ సి.హెచ్.సురేష్ బాబు, జిల్లా కోశాధికారి బి.ఓంకార్,జిల్లా ప్రచార కార్యదర్శి డి.అర్జున్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు SK. మహబూబ్ బాషా, కలక్టరేట్ యూనిట్ సెక్రెటరీ అర్. సుమంత్ జిల్లా సహదక్షులు శ్రీ విజయ్ కుమార్, మహిళా విభాగం నాయకురాలు యమ్. మాధురి, అర్చన, ఇతర కార్యవర్గ సభ్యులు ఏ.శివరామకృష్ణ, జి.సాయి, పి.శ్రీలక్ష్మి, డి.శ్రీనివాసరావు, పి.సురేష్ బాబు, డి.వెంకటేశ్వర రావు యమ్.రాజిమ్మ, మరియు వివిధ డిపార్ట్మెంట్ కి చెందిన నాయకులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE