Suryaa.co.in

Andhra Pradesh

వైసిపి ప్రభుత్వ జీతగాళ్ల కృషి ఫలించలేదు

ప్రజా వేదికను కూల్చిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ ని ఎందుకు కూల్చలేకపోయింది?
.గాంధీ జైలుకు వెళ్లారు జగన్ జైలుకు వెళ్లారు ఏమైనా పోలిక ఉందా?
– కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు

విజయనగరం: వైసిపి ప్రభుత్వ జీతగాళ్ల కృషి ఫలించలేదు. ఎన్నికల బాధ్యతలు మంత్రుల పై వేశారు.ఇప్పుడు వారి పై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.బడ్జెట్ లో ఒట్టిమాటలు చెప్పారు. ఇప్పటికే పర్మినెంట్ డామేజ్ జరిగింది.వైసిపి ప్రభుత్వ ఉన్న సమయంలో ఇంకెంత డామేజ్ చేస్తారో చూడాలి.ప్రజల్లో ఆలోచన వస్తే ఇటువంటి సైకోలు, జైలు నుండి వచ్చిన వారు పాలించలేరు. ఈ ఫలితాల ద్వారా మూర్ఖులు బుద్ధి తెచ్చుకొని మారాలని కోరుకుంటున్నాను.అసెంబ్లీ ని టిడిపి కట్టింది ప్రజా వేదికను కూల్చిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ ని ఎందుకు కూల్చలేకపోయింది? చిన్న గోతులను పెద్దగోతులు చేసిన వారు వైసీపీ పాలకులు. చట్టాలను చుట్టాలుగా మార్చుకున్నారు.గాంధీ జైలుకు వెళ్లారు జగన్ జైలుకు వెళ్లారు ఏమైనా పోలిక ఉందా?

LEAVE A RESPONSE