– సీపీఎం డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న జగనన్న విద్యాకానుక కిట్ల అవినీతిపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న జె.వి.కె. కిట్లలో అవినీతి జరిగిందని వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండేళ్ళుగా పాఠశాలలో చేరిన విద్యార్థులకంటే ఎక్కువ కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలిన కిట్లు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్జస్ట్ చేయకుండా సమగ్ర శిక్షా అభియాన్ అవసరానికి మించి కిట్లకు టెండర్లు పిలిచింది.
2021`22, 2022`23 సంవత్సరానికి రూ.9,28,824 కిట్లు మిగిలినా 2023`24 సంవత్సరానికి 43 లక్షల కిట్లు ఆర్డర్ ఇచ్చారు. కానీ 2022`23 లో రూ.40,31,239 విద్యార్థులు మాత్రమే పాఠశాలల్లో చేరారు. 5 శాతం అదనంగా కలుపుకున్న ఈ సంఖ్య ఎక్కువే అవుతుంది. విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన 9,28,824 కిట్లు ఏమయ్యాయి? అదనంగా కిట్లు ఎందుకు ఆర్డర్ ఇస్తున్నారు అనేది విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.