ఆయన అప్పుడప్పుడూ 12 కోట్లు పెట్టి హాలిడేకి లండన్ వెళ్తాడు
యువగళంతో విరిగిన వైసీపీ ఫ్యాన్ రెక్కలు
గ్రంధి శ్రీనివాస్ భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ
యువగళం దెబ్బకి జగన్‌రెడ్డి మోహం మాడిపోయింది
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
యువగళం దెబ్బకి వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మోహం మాడిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు. మంగళవారం భీమవరం లో పర్యటించారు.
ఈ సందర్భంగా బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ ‘‘స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు జన్మించిన గడ్డ ఇది. సంక్రాంతి అంటే ఠక్కున గుర్తొచ్చేది భీమవరం.భీమవరం వాళ్లు సినీమా ఇండస్ట్రీని కూడా వదల్లేదు. నటులు, నిర్మాతలు, దర్శకులు భీమవరం వాళ్లే.యువగళం..మనగళం..ప్రజాబలం. మీ లోకేష్ ప్రజల్లో ఉంటాడు… జగన్ పరదాల్లో ఉంటాడు.
జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం. మీ లోకేష్‌ది అంబేద్కర్ రాజ్యాంగం. యువగళాన్ని తొకేస్తాం అన్నారు. ఇప్పుడు రాష్ట్రమంతా యువగళమే. యువగళం దెబ్బకి వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి..జగన్ మోహం మాడిపోయింది.యువగళాన్ని అడ్డుకోమని ఫ్రస్ట్రేషన్ అంకుల్.. జగన్‌రెడ్డి సైకో సైన్యాన్ని పంపాడు. మన వాళ్లు సైకో సైన్యాన్ని తన్ని పంపారు.ఇప్పుడు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు. మేము ఫ్లెక్సీలు వెయడం మొదలు పెడితే జగన్‌కి గుండెపోటు వస్తుంది. అబ్బాయిలు హూ కిల్డ్ బాబాయ్ అంటూ ప్లకార్డ్ ప్రదర్శించారు.
భయం మా బయోడేటాలో లేదు బ్రదర్.నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర. అడ్డుకుంటే దండయాత్ర. జగన్ హాలిడే సీఎం.. ఆయన అప్పుడప్పుడూ 12 కోట్లు పెట్టి హాలిడేకి లండన్ వెళ్తాడు. ఈయన పేదలకి పెత్తందార్లకి యుద్ధం అని ఫోజులు కొడుతున్నాడు.ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికులకు హాలిడే ఇచ్చాడు. పరిశ్రమలు తరిమేసి యువతకు హాలిడే ఇచ్చాడు.ఆక్వా రంగాన్ని నాశనం చేసి ఆక్వా హాలిడే ఇచ్చాడు. రైతులను ముంచి క్రాప్ హాలిడే ఇచ్చాడు.
ఇప్పుడు పరిశ్రమలకు కరెంట్ కోతలు పెట్టి పవర్ హాలిడే ఇచ్చాడు. పరిశ్రమలకు 12 గంటలు పవర్ హాలిడే అంట. ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకే యంత్రాలు తిప్పాలట. సమయం దాటి నడిస్తే కేసులు పెట్టి ఫైన్లు వేస్తారట. సైకో జగన్ మెుఖం చూసి వచ్చే పరిశ్రమే లేదు పైగా బాదుడే బాదుడు, పవర్ హాలిడేలు.పెంచిన విద్యుత్ ఛార్జీలు, పవర్ హాలిడే దెబ్బకి పరిశ్రమలు అన్ని బైబై ఏపీ అనడం ఖాయం.
చంద్రబాబుని చూస్తే ఏం గుర్తొస్తుంది? కియా, ఫాక్స్ కాన్, హెచ్సిఎల్, పోలవరం,24 గంటల విద్యుత్ గుర్తొస్తాయి.జగన్‌ని చూస్తే ఏం గుర్తొస్తుంది? కోడికత్తి. బూమ్, బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గోల్డ్ మెడల్, అంధకారప్రదేశ్ గుర్తొస్తాయి.జగన్ ఒక బిల్డప్ బాబాయ్. ఆయన ఇచ్చే బిల్డప్‌కి, రియాలిటీకి మధ్య తేడా మీకు తెలియాలన్నారు.
గ్రంధి శ్రీనివాస్ భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ : స్థానిక వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
గ్రంధి శ్రీనివాస్ అక్రమాలపై వైసీపీ కార్యకర్తలే ఫిర్యాదు చేశారన్నారు. జగన్ ఇసుకాసురుడైతే గ్రంధి శ్రీనివాస్ భూబకాసురుడని లోకేశ్ ధ్వజమెత్తారు. తక్కువ ధరకు భూములు కొని ఎక్కువ ధరకు అమ్మారని ఆరోపించారు. పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదు..ఆయన మాత్రం పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. గ్రంధి శ్రీనివాస్ సొంత పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టించారు.
టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తామన్న హామీ ఏమైంది. భీమవరాన్ని మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దుతాం. డంపింగ్ యార్డు, రింగ్‌రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తాం. కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తాం. ఉండి సెంటర్‌లో వంతెన నిర్మిస్తాం. ఆకివీడు పంచాయతీలో సమస్యలు పరిష్కరిస్తాం. టీడీపీ హయాంలో భీమవరంలో రూ.1500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అధికారంలోకి రాగానే రోడ్లు బాగు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
మీ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా : ‘‘మీ లోకేశ్ ప్రజల్లో ఉంటాడు.. జగన్ పరదాల్లో ఉంటాడు. జగన్‌ది రాజారెడ్డి రాజ్యాంగం అయితే.. లోకేశ్‌ది అంబేడ్కర్ రాజ్యాంగం. యువగళాన్ని తొక్కేస్తామన్నారు.. ఇప్పుడు రాష్ట్రమంతా యువగళమే. యువగళం దెబ్బకి వైకాపా ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. జగన్ ముఖం మాడిపోయింది. ఇప్పుడు రెచ్చగొట్టే ఫ్లెక్సీలు పెడుతున్నారు. జగన్ హాలిడే సీఎం.. అప్పుడప్పుడు రూ.కోట్లు ఖర్చుపెట్టి హాలిడేకి లండన్ వెళ్తారు. 2వేల కి.మీ పాదయాత్రలో మీ కష్టాలు చూశా.. కన్నీళ్లు తుడుస్తా. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించాం. జగన్ పాలనలో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో రైతులు నష్టపోతున్నారని లోకేశ్ తెలిపారు.
చిచ్చు రేపిన ఫ్లెక్సీ వివాదం : భీమవరం ప్రకాశం చౌక్ వద్ద వైసీపీ , టీడీపీ శ్రేణుల మధ్య ఫ్లెక్సీల వివాదం రేగింది. ‘పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం పేరుతో’ వైసీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. వైసీపీకి పోటీగా ‘అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’ పేరుతో టీడీపీ ఫ్లెక్సీ పెట్టింది. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. కాగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఉక్రెయిన్‌లోని యుద్ధ పరిస్థితుల కారణంగా తెలుగు విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.