Suryaa.co.in

Andhra Pradesh

ఇసుక అక్రమ రవాణా డబ్బు జగన్, భారతికి వెల్లంపల్లి అందించేవాడు

  • వరద బాధితులకు కేవలం కోటి రూపాయలే ఇవ్వడం సిగ్గుచేటు
  • కృష్ణా నదికి, బుడమేరు కాలువకు తేడా కూడా తెలియని అజ్ఞాని జగన్
  • బాధితులకు కేవలం కోటి రూపాయలు ఇవ్వడం దుర్మార్గం
  • సిరిసిరిమువ్వ రోజా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం
  • టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఫైర్

నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే విజయవాడ ప్రజలకు శాపంగా మారిందని, ఇసుక తవ్వకాలు, కాలువల ఆక్రమణలతో విజయవాడని జగన్ నాశనం చేశారంటూ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణా డబ్బు జగన్ , భారతికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందించేవాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద బాధితుల పట్ల జగన్మోహన్ రెడ్డికి ప్రేమ, అభిమానం ఉంటే.. సీఎం చంద్రబాబు నాయుడు కు పోటీగా సహాయక చర్యలో పాల్గొనాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సవాల్ విసిరారు.

బుడమేరు వాగులో వైసీపీ నేతలు వెల్లంపల్లి, అవినాష్ ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు జరిపి లేవుట్స్ వేశారు. గుర్రపు డెక్క, శిల్ట్ క్లినింగ్ పేరుతో ప్రభుత్వ నిధులను వైసీపీ నేతలు దిగమింగారు.బుడమేరు వాగు కి గేట్లు ఉంటాయని జగన్ వ్యాఖ్యానించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం.

74 ఏళ్ల వయసులో చంద్రబాబు వరద బాధితుల కోసం పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారు.ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, వరద బాధితుల కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి.టూరిస్ట్ జగన్ మోహన్ రెడ్డికి.. కాలువ ఎక్కడుందో కృష్ణ నది ఎక్కడుందో కూడా తెలియదు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసిన జగన్, వరద బాధితులకు కేవలం కోటి రూపాయలు ఇవ్వడం దుర్మార్గం. ఇటలీ లో మేకప్ కోసం వెళ్ళిన సిరిసిరిమువ్వ రోజా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం. వరద బాధితుల సహాయార్థం నా కుటుంబం తరఫున 10 లక్షల దాకా చంద్రబాబుకు అందిస్తాం.

బుడమేరు వాగు కు గేట్లు ఉంటాయని జగన్ వ్యాఖ్యానించడం, ఆయన అజ్ఞానానికి నిదర్శనం అంటూ ఎద్దేవా చేశారు.వాగుకు, నదికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలియదంటూ కామెంట్ చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి, వరద బాధితులకు కేవలం కోటి రూపాయలే ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. నడుము లోతు నీటిలో, జెసిబి లో తిరుగుతూ చంద్రబాబు వరద బాధితులకు అండగా నిలుస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

దివిసీమ ఉప్పెనలో మండలి వెంకటకృష్ణారావు తర్వాత, అంతమంది జనాలను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వంలో వరదలు వస్తే ఆయన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారని, కానీ చంద్రబాబు మాత్రం నడుము లోతు నీళ్లలో దిగి స్వయంగా అధికార యంత్రాంగం చేత పనిచేయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుడమేరు వాగు నుంచి, చంద్రబాబు నివాసానికి ఎంత దూరం ఉందో ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

వాడిపోయిన రోజా అనవసరంగా వాగుతోంది..
మేకప్ కోసం ఇటలీకి వెళ్లిన రోజా.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కోటంరెడ్డి మండిపడ్డారు. 74 ఏళ్ళ వయసులో వరద నీటిలో దిగుతున్న చంద్రబాబును చూసి.వైసీపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. సిరిసిరిమువ్వగా ఉన్న రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ అయన హెచ్చరించారు.
సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్, పిట్టి సత్యనాగేశ్వరరావు, జహిర్, కువ్వారపు బాలాజీ, ముఖ్య నేతలు అంచురి శ్రీనివాసులు నాయుడు, పసుపులేటి మల్లికార్జున్, తంబి సుజన్, మహేంద్ర రెడ్డి, అజయ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE