Suryaa.co.in

Andhra Pradesh

సహాయం చేయకుండా జగన్‌ పులివేషాలు!

– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శ

విజయవాడ: విజయవాడను వరదలు చుట్టుముడితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విజయవాడ నగరంలో తిష్ఠవేసి, ప్రతి ఒక్కరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. భోజనాలు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మందులు అందిస్తోంది… నడుము లోతు నీళ్ళల్లో దిగి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడతా ఉంటే… మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా వచ్చి సెల్ఫీలు దిగి, ఫోటోలకు ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శించారు.

ఈ మేరకు సప్తగిరి బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కనీసం ఒక్క పులిహోర ప్యాకెట్ కూడా పేదలకు పంచకుండా, ఫోటోలు కోసం పులివేషాలు వేశారని ఆయన దుమ్మెత్తిపోశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే లండన్ పర్యటనకు వెళ్ళిన నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదన్నారు. లండన్ కి ఎందుకు వెళ్తున్నారని మేం అడగటం లేదు. కానీ వరదల్లో కూడా బురద రాజకీయాలు చేయటం పైన తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామన్నారు.

మరోపక్క మాజీ మంత్రి రోజా చెన్నైలో ఏసీ రూంలో కూర్చొని ప్రభుత్వం పైన విమర్శలు చేస్తోందన్నారు. రోజాకు దమ్ముంటే విజయవాడ నగరంలోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి… ఎక్కడో చెన్నైలో కూర్చొని ఉపన్యాసాలు దంచడం కాదు… గుంటూరు, విజయవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే దమ్ముందా అని సూటిగా ప్రశ్నిస్తున్న. విజయవాడకు వస్తే మహిళలు తరిమికొడతారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు సునీల్ చౌదరి, పార్టీ మండల కార్యదర్శి మధు యాదవ్, రైతు కార్యదర్శి బాబు నాయుడు, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE