“ఆధారాలు”
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు
Vs
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు
జగన్ రెడ్డిని జైల్లో పెట్టటానికి తన పరపతిని అడ్డం పెట్టాల్సిన గతి ఏ కోర్టుకూ లేదు. అదే బాబు అక్రమ అరెస్టులో కోర్టును బూచిగా చూపించి, బాబు పైన బురద జల్లాలనేది దిక్కుమాలిన ఎత్తుగడ. ఎన్ని కుతంత్రాలు చేసినా వీళ్ళ దొంగ బతుకు జనానికి అర్థమైపోయింది. అది ఎలాగో విశ్లేషించి చూద్దాం..
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు..
ఈడీ సీబీఐ జప్తులో 43 వేల కోట్ల అక్రమాస్తులు..అంతకుముందే బీపీ ఆచార్య, శ్రీ లక్ష్మీ, రాజగోపాల్ అనే ముగ్గురు ఐఏఎస్ అధికారులను సీబీఐ అరెస్టు.. కోర్టు అనుమతితో ఐఏఎస్ ల పైన సీబీఐ విచారణ.. జగన్ రెడ్డి కేసులో ఐఏఎస్ ల వాంగ్మూలాలు..అక్రమాస్తులకు సహకరించినందుకు అధికారుల పైన అభియోగాలు.. కోర్టు విచారణలు, శిక్షలు.
67 షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో జగన్రెడ్డి 43 వేల కోట్ల మనీ లాండరింగ్ పైన.. సీబీఐ, ఈడీ చేసిన మనీ ట్రయల్, వారం రోజులు జగన్రెడ్డిని విచారణ, ఆధారాలను క్రాస్ ఛెక్ చేసుకోవటం, ఆ పైన కోర్టు అనుమతితో సీబీఐ అరెస్టు.. ఆరు నెలల పాటు సాగిన మొత్తం ప్రక్రియ..
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సంగతి చూద్దాం..
కోర్టు బాబుకు రిమాండ్ ఇచ్చింది కాబట్టి బాబు పైన బురద చల్లేస్తాం అంటున్నారు.
బాబు కి షెల్ కంపెనీలు లేవు.అధికారుల అరెస్టులు లేవు.అధికారుల విచారణలు లేవు. ఎవరికీ ఎటువంటి శిక్షలు లేవు. ఆరోపణ, విచారణ, అరెస్టు అన్ని చేసేది జగన్రెడ్డి నీలి కూలి సైకో ముఠాలే.
మిగతా వ్యవస్థలన్నీ నామ్ కే వాస్తే..బాబు ఖాతాల్లో మనీ లాండరింగ్ లేదు.అసలు బాబుకు షెల్ కంపెనీలే లేవు, వాటికింక ఖాతాలెక్కడ?
బాబు అక్రమ అరెస్టుకు ముందు సీఐడీ నుంచి మనీ ట్రయల్స్ … నాలుగేళ్లుగా లేవు గత నలభై రోజులుగా కూడా లేవు.ఎవరో ఏపీ సీఐడీని వెనుక నుంచి తరుముతున్నట్టుగా ఆగమేఘాల మీద కేవలం 48 గంటల్లో పూర్తైన బాబు అక్రమ అరెస్టు ప్రక్రియ.
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఆరు నెలల విచారణ ఎక్కడ?
బాబు 48 గంటల్లో అడ్డగోలుగా అక్రమ అరెస్టు ఎక్కడ?
గత నాలుగేళ్లుగా జగన్ రెడ్డి కోర్టుల్లో 2,800 ఆబ్సెంట్ వాయిదాలు తీసుకున్నాడు.
బాబు దమ్ముగా ధైర్యంగా కోర్టుల్లో విచారణలను ఢీకొడుతున్నాడు.
నాలుగేళ్ళ తర్వాత తన పేరు అడ్డగోలుగా చేర్చిన అక్రమ FIRని క్వాష్ చెయ్యాలని నేరుగా కోర్టుల్లో
బాబు న్యాయ పోరాటం సాగిస్తున్నాడు.
పదేళ్ళుగా జగన్ రెడ్డికి బెయిల్. బహుశా ప్రపంచ రికార్డు అనుకుంటా.. బాబుకు మాత్రం నో బెయిల్..
జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసును మోస్తున్నది కోర్టులు కాదు..కోర్టుల పరపతీ కాదు. జగన్ రెడ్డి ఎందుకు జైల్లో వున్నాడని అడిగితే జవాబు..43 వేల కోట్ల సీబీఐ మనీ ట్రయల్ జగన్రెడ్డి కేసుల్ని మోస్తోంది.
బాబు అక్రమ అరెస్టు ఎందుకు జరిగిందంటే.. జవాబు లేదు..కోర్టుల నెత్తికే అంటగడుతున్నారు. కోర్టుల పరపతిని బాబు పైన నిందలకు ఊతంగా వాడుకుంటున్నారు.. అంతే గాని ఏపీ సీఐడీ దగ్గర సరుకు బండి సున్న..బాబు పైన అక్రమకేసుల్లో, సరుకు బండి సున్న.
ఓ భారతీయుడా..ఈ తేడా, ఈ మతలబు నీకు అర్థమైందా ? వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న ముఠాలెవరో, వాళ్ళ దొంగ మాటలేమిటో.. అర్థమైందా ?
– హర్షవర్ధన్‌రెడ్డి