Suryaa.co.in

Andhra Pradesh

హనుమాయమ్మను క్రూరంగా, కిరాతకంగా చంపింది జగన్ బ్యాచే

– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం రావివారిపాలెంలో వైసీపీ నాయకుడు కోటేశ్వరరావు దళిత మహిళ హనుమాయమ్మను అత్యంత దారుణంగా చంపడం వైసీపీ అరాచకాలకు పరాకాష్ట.సినిమాలలో కూడా చూపని విధంగా ఘోరమైన, అతి కిరాతకమైన పద్ధతిలో వైసీపీ నాయకులు ట్రాక్టర్ల నాగళ్లతో హనుమాయమ్మను చంపారు.

హనుమాయమ్మ పొత్తికడుపుపై దున్ని చంపడాన్ని చూస్తే వైసీపీ రౌడీలు ఎంతకు బరితెగించారో అర్థమవుతోంది. అనాగరిక ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ప్రవర్తించరు. ఏపీలో వైసీపీ రౌడీలు అనునిత్యం ఏదో ఒక ప్రాంతంలో చెలరేగిపోతూనే ఉన్నారు. అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్న హనుమాయమ్మను వర్ణించడానికి వీలుకాని విధంగా అతి క్రూరంగా హత్య చేస్తే.. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ ఎందుకు స్పందించటంలేదు?

గతంలో అన్యాయానికి గురైన బాధిత మహిళను పరామర్శించడానికి చంద్రబాబు వస్తే ఆయనపై కేసు పెట్టిన వాసిరెడ్డి పద్మ.. హనుమాయమ్మను హతమార్చిన వైసీపీ గూండాల విషయంలో నోరెందుకు మెదపటంలేదు?మహిళా హోం మంత్రి, మహిళా కమిషన్ ఛైర్మన్, మహిళా మంత్రులు, దళిత మంత్రులు జగన్ రెడ్డి చుట్టూ చేరి జగన్ చేసే అరాచకాలను కీర్తిస్తూ భజన చేయడానికే పనికొస్తారు తప్ప అన్యాయం గురించి మాట్లాడటానికి పనికిరారు.

జగన్ దళిత మహిళలు, ప్రజలపై దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. జగన్ రెడ్డి దీనికి సరైన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చిన్న సంఘటన జరిగితే రోడ్లెక్కి నిరసన తెలిపే ప్రజా సంఘాలు నేడు ఏమయ్యాయి?

గత నాలుగేళ్ల నుండి రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో మునుపెన్నడూ చూడని ఘోరాలు, దారుణాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే హక్కుల కోసం పోరాడే హక్కుల సంఘాలు
జగన్ ను ప్రశ్నించాలని కోరుకుంటున్నాం.హనుమాయమ్మను కిరాతకంగా హత్య చేసిన హంతకులకు శిక్ష పడేంతవరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంటుంది.

రాష్ట్రంలో పోలీసులు హంతకులను, కిరాయి రౌడీలను, వైసీపీ గూండాలను, గంజాయి సరఫరా చేసేవారికి అండగా ఉంటోందే తప్ప చట్టాన్ని, న్యాయాన్ని కాపాడటానికి ఏపీ పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారని అర్థమవుతోంది.

LEAVE A RESPONSE