– వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
-టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్
అప్పుడు మద్యనిషేదం విధిస్తానని చెప్పి ఇప్పుడు మద్య నియంత్రణ అని మాట మార్చిన ఘనుడు జగన్ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ దుయ్యబట్టారు. ఆదివారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ మద్య నిషేదం విషయంలో మాట మార్చారు.
అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేదిస్తామని చెప్పిన జగన్ ఇప్పడు మద్యాన్ని నియంత్రిస్తున్నానని అంటున్నారు. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాం అని చెప్పి ఎక్కడ చూసి మద్యం లభ్యమయ్యేలా చేస్తున్నారు. మధ్య నిషేధం విధించాకే ఓటు అడుగుతాం అని చెప్పిన జగన్ ఆ మాటని తుంగలో తొక్కాడు. నాడు మద్యపాన నిషేధం అన్న జగన్ రెడ్డి నేడు అక్రమ సంపాదన కోసం మాట తప్పి మడమతిప్పి తన బినామీల చేత నాసిరకం మద్యం తయారు చేయించి అమ్ముతున్నాడు.
ప్రజల ధన, మాన, ప్రాణాల్ని హరిస్తున్నాడు. జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే నేషనల్ ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్లు రద్దుచేశారు. తన బినామీలు, వైసీపీ నేతలకు చెందిన డిష్టరీల్లో తయారైన నాసిరకం మద్యం విక్రయించి వేల కోట్లు దండుకుంటున్నారు. నాసిరకం మద్యం తాగిన వారు మానసికంగా దెబ్బతిని గందరగోళానికి గురవుతున్నారు. జగన్ సరఫరా చేసే మద్యంలో విష రసాయనాలు ఉన్నట్లు చెన్నైకి చెందిన ఎస్జిఎస్ ల్యాబ్ పరీక్షల్లో వెళ్లడైంది.
నాసిరకం మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. మద్యం మత్తులో అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లు జరుగుతున్నాయి. మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ కి అనుమతి ఇవ్వకుండా నగదు లావాదేవీల్లో గోల్ మాల్ చేస్తున్నారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం 28 వేల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కి మళ్ళించారు. దీనికి తోడు మద్యం డిష్టరీల్లో కమిషన్లలో మరో 13,500 కోట్లు మొత్తం కలిపి 40, 500 కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కు తరలి వెళ్తున్నాయి. జగన్ రెడ్డి పాలనలో మద్యంబాబులకు ఇబ్బందులు తప్పడంలేదు.
మద్యనిషేదం విధిస్తామని మేనిఫెస్టో లో చెప్పాడు. తన మేనిఫెస్టో ఖురాన్ లాంటిదన్నాడు. నేడు నవరత్నాల్లో మద్యపాన నిషేదం లోగో నేడు అక్షరాన్ని తీసి నియంత్రణలు పెట్టి మోసం చేశారు. బటన్ రెడ్డి కల్లబొల్లి మాటలు నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఒక్క అవకాశం ఇవ్వండి అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేదం విధిస్తానని చెప్పి ఇప్పుడు మద్యం నియంత్రణ అంటున్నారు. రాష్ట్రంలో 2,900 పైచిలుకు వైన్స్ షాపులకు పర్మిషన్ లు ఇచ్చి మద్యాన్ని ఏరులూ పారిస్తున్నారు.
తనకు సంబంధించిన వారితో డిస్టరీలు పెట్టించి కుంభకోణం చేస్తున్నారు. ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. సొంత డిస్టలరీలు పెట్టకుని 21వేల కోట్లరూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. డిస్టలరీల ద్వారా సంపాదిస్తున్న డబ్బులే కాకుండా మద్యం ధరలను మూడు రెట్లు పెంచారు. మద్యం బాబులను కూడా తాకట్టు పెట్టారు. అప్పు తెచ్చారు. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రతిరోజు లక్ష రూపాయల మద్యం అమ్ముడుబోతోంది.
పట్టణాల్లో మూడు, నగరాల్లో ఐదు లక్షల రూపాయల చొప్పున మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ ఆదాయమంతా ఎక్కడికి పోతోంది? కరోనా లాంటి మహమ్మారి సమయాల్లో కూడా మద్యం షాపులను తెరిపించిన ఘనత జగన్ కే దక్కుతుంది. ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద క్యూలను నియంత్రించడానికి వినియోగించి ఉపాధ్యాయులను అవమానించారు. కూరగాయలు, హోటళ్లు, టీ అంగళ్లల్లో కూడా పేటీఎం, ఏటీయం నడుస్తుంటే.. మద్యం షాపుల్లో మాత్రం నగదే కావాలి. జగన్ కు చిత్తశుద్ధి లేదు.
5 స్టార్ హోటళ్లకే మద్యం సరఫరా అని చెప్పిన జగన్ నేడు వాకింగ్ స్టోర్స్, వైన్ షాపులు, బార్ షాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు. మహిళలను ఇబ్బందిపాలు చేస్తున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 15 సంవత్సరాలకు తాకట్టు పెట్టి 33 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్ముడుబోతోంది. రాష్ట్రంలో గంజాయి పెద్ద ఎత్తున సాగు అవుతోందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియా ధృవీకరించారు. దేశంలో 75 వేల టన్నుల గంజాయి పట్టుబడితే అందులో 25 శాతం ఆంధ్ర రాష్ట్రం నుంచి పట్టుబడింది.రాష్ట్రంలో వైసీపీ నాయకులే రాత్రిళ్లు మద్యాన్ని అమ్ముకుంటున్నారు. ప్రతి ఒక్క మద్యం షాపులో అక్రమాలు జరుగుతున్నాయి.
అధికారికంగా వైన్ షాపుల్లో లక్షా, రెండు లక్షల వ్యాపారం జరుగుతున్నా అనధికారికంగా లెక్కే లేదు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఇకమీదట జగన్ బూటకపు మాటలు ప్రజలు నమ్మరు. ఇంతవరకు ఏ ఒక్క వాగ్దానానని నెరవేర్చలేదు. జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ తెలిపారు.