ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

Spread the love

హనుమాన్ జయంతి సందర్భంగా మద్దూరు ఆంజనేయ స్వామి ఆలయం నుండి పెనమలూరు మీదగా కంకిపాడు వరకు శోభాయాత్ర విశ్వహిందూ పరిషత్ భజరంగ్దళ్ ప్రకండ వల్లభుని లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న అగ్నికులక్షత్రియ జాతీయ అధ్యక్షులు నాగిడి సాంబశివరావు , భజరంగ్ దళ్ నాయకులు అరవింద్ జెండా ఊపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నాగిడి సాంబశివరావు మాట్లాడుతూ మొట్ట మొదటి సరిగా మద్దూరు గ్రామం నుండి శోభ యాత్ర స్టార్ట్ చెయ్యటం ఆనందగా ఉంది అని తెలియజేసారు. అరవింద్ మాట్లాడుతూ, హిందువుల అందరు ఐక్యంగా ఉండి దేశం కోసం ధర్మం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్నికులక్షత్రియ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు లంకే రాజ్ కమల్, గ్రామ ప్రెసిడెంట్ చిప్పల దాసు, ఎం పి టి సి వడుగు శ్రీను, చిప్పల బుల్లి బసవయ్య, పోతాబతుల నాగార్జున మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply