-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
-దళితులారా మేల్కోండి కరపత్రం విడుదల
మంగళగిరి: దళితులను నమ్మించి మోసం చేసిన జగన్ రూ.4,038 వేల కోట్ల దళితుల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించాడని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డా రు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం దళితులారా మేల్కోండి కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 27 దళిత పథకాలు రద్దు చేసి దళితుల సంక్షేమాన్ని తుంగలో తొక్కాడని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన దళిత బిడ్డకు గుండు కొట్టారు…మాస్క్ అడిగితే డాక్టర్‌ను చంపేశారు…దళిత ఆడబిడ్డలపై అత్యా చారాలు చేశారు, హత్యలు చేశారు…దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశారు. దళితులపై ఇన్ని అరాచకాలు చేయించిన జగన్‌కు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లెద్దు సుశీలరావు పాల్గొన్నారు.