-తెలుగుదేశం పార్టీ విజయానికి అండగా నిలవాలి
-వైసీపీ నుంచి రక్షించుకోవటానికి రాష్ట్ర ప్రజలు ఏకమవ్వాలి
-మహిళలపై నేరాలు, డ్రగ్స్‌లో ఏపీ నెంబర్ 1
-పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లేలా వేధింపులు
-ఉద్యోగావకాశాలు కల్పించకుండా యువతను మోసగించారు
-డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్నారు
-రాజధాని లేని ఏకైక రాష్ట్రం సిగ్గుచేటు
-డోన్ నిజం గెలవాలి యాత్రలో నారా భువనేశ్వరి
వైసీపీ బారి నుంచి రక్షించుకోవటానికి ఈ కురుక్షేత్ర ఎన్నికల సమరంలో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం హెచ్.కొట్టాల గ్రామంలో కార్యకర్త పువ్వాడి నాగేశ్వరరావు కుటుంబాన్ని నిజం గెలవాలి యాత్రలో భాగంగా గురువారం భువనేశ్వరి పరామర్శించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మండుటెండను లెక్కచేయకుండా తన కోసం వచ్చిన మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. 53 రోజులు చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించిన సమయంలో ఏనాడూ రోడ్డు మీదకు రాని మహిళలు కూడా రోడ్డు మీదకు వచ్చి పోరాడారు… చంద్రబాబుకు పెద్దఎత్తున మహిళలను మద్దతుగా నిలిచారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్లో ఒక్క ఆధారాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం నిరూపించలేకపోయిందన్నారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మహిళలను సైతం పోలీసులు వేధించారని అన్నారు.
పరిశ్రమలను తరిమేశారు
ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ నిర్మాణం చేసే సమయంలో చంద్రబాబును అనేక మంది విమర్శించారు. కానీ నేడు ఐటీ పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెడుతున్నాయని తెలిపా రు. ఏపీని కూడా తెలంగాణ మాదిరి అభివృద్ధి చేయాలని చంద్రబాబు ప్రయత్నించారు… దురదృష్టవశాత్తు 2019లో వైసీపీ గెలిచింది రాష్ట్రం వెనుకకు వెళ్లిందని విమర్శించారు. చంద్రబాబు తెచ్చిన ఒక్కో పరిశ్రమను వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం వేధించి ప్రక్కనున్న రాష్ట్రాలకు తరిమేశారని ఆరోపించారు. అమర్‌రాజా బ్యాటరీస్ కంపెనీ తెలంగాణ వెళ్లి అక్కడ వేలాది మంది యువ తకు ఉద్యోగావకాశాలు కల్పించిందని పేర్కొన్నారు. అన్నదాతలను దృష్టిలో పెట్టుకుని పోలవరాన్ని 72 శాతం పనులు వేగంగా పూర్తిచేస్తే వైసీపీ వచ్చాక దాన్ని పట్టించుకోకుండా వదిలేసిందని, నదుల అనుసంధానంతో రాయలసీమకు కూడా గోదావరి నీళ్ల తెచ్చిన ఘనత చంద్రబాబుద ని తెలిపారు.
గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం తప్ప పరిశ్రమలు శూన్యం
గత ఐదేళ్లలో ఏపీకి గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యం వచ్చాయే తప్ప ఒక్క పరిశ్రమ కూడా రాలేదని విమర్శించారు. తాజాగా విశాఖపట్నంలో 25 వేల కిలోల డ్రగ్స్‌ను వైసీపీ నాయకులు తీసుకొచ్చారని, రాష్ట్ర యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలై మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం కల్తీ మద్యం ఇచ్చి వారి జేబులు ఖాళీ చేస్తోందని, దీనివల్ల అమాయక ప్రజలు చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏపీ ముందు స్థానంలో నిలబడటం సిగ్గు చేటని విమర్శించారు. మన దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ ఒక్కటేనని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా ప్రతిరోజు మీ ఓటు ఉందో లేదో, మీ భూములు ఉన్నాయో లేవో కూడా పరిశీలించుకోవాలని సూచించారు.
పెన్షన్లతో నీచ రాజకీయాలు చేస్తున్నారు…
రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో ప్రక్కనున్న రాష్ట్రాలతో పోటీ పడిన చంద్రబాబును…నేడు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచా రం చేయటం నీచ రాజకీయానికి తార్కాణమని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేక ఆ వైఫల్యాన్ని చంద్రబాబుకు అంటగడుతున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా రూ.3 వేలు నిరుద్యోగ భృతి, రైతులకు ప్రతియేటా రూ.20 వేలు పెట్టుబడి సాయం, 18 ఏళ్లు నిండిన మహిళకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థికసాయం, చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు, పేదలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వెల్లడిరచారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో చంద్రబాబు ముందు చూపుతో సిద్ధంగా ఉన్నారు…రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాలని సూచించారు. బ్రిటీషు వారి నుంచి దేశానికి స్వాతం త్య్రం సాధించడానికి గాంధీజీతో దేశ ప్రజలు ఎలా చేయి చేయి కలిపి సహకరించారో …వైసీపీ నుంచి ఏపీని విడిపించుకోవడానికి ఎన్నికల కురుక్షేత్రంలో రాష్ట్ర ప్రజలు చంద్రబా బుతో నిలబడి పోరాడి పసుపు జెండాను ఎగరేయాలని పిలుపునిచ్చారు.