• రాష్ట్రంలోని సహకార పాడిపరిశ్రమ వినాశనంకోసమే జగన్ రెడ్డి ‘అమూల్ బేబీ’ అవతారం ఎత్తాడు
• పాడిరైతులకు నయాపైసా సాయం చేయని అమూల్ సంస్థ కోసం పాడిపరిశ్రమ అభివృద్ధికోసం పనిచేస్తున్న సహకారడెయిరీలను నాశనంచేయడమేంటి జగన్ రెడ్డి?
• అడ్డగోలుగా చిత్తూరు డెయిరీ ఆస్తుల్ని నామమాత్రంగా ఏడాదికి రూకోటిచొప్పున 99ఏళ్లకు అమూల్ కు లీజుకిచ్చాడు
• ఏడాదిలో అధికారం కోల్పోయి చంచల్ గూడ జైల్లోఉండే జగన్ రెడ్డికి రూ.650కోట్ల విలువైన ఆస్తుల్ని 99ఏళ్లపాటు లీజుకిచ్చే హక్కు ఎక్కడిది?
• పాడిరైతులకు లీటర్ కు రూ.4ల బోనస్ ఇస్తానన్న జగన్ హామీ నేడు బోగస్ గా మారింది
• పాడిరైతులకు బోనస్ తో పాటు, బీమా అమలు చేయడం, సబ్సిడీపై పశుగ్రాసం, దాణా, గేదెలకు ఉచితవైద్యం అందిస్తున్న సహకార డెయిరీలు జగన్ రెడ్డికి ఎందుకు చేదు అయ్యాయి? అమూల్ ఎందుకు ముద్దు అయ్యింది?
టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రాష్ట్రపాడిపరిశ్రమను కబళించి, పాడిరైతుల్ని తనగుప్పెట్లో పెట్టుకొని, కమీషన్లకక్కుర్తితో ఏపీలోని సహకార డెయిరీ లను నామరూపాలు లేకుండా నాశనంచేయాలన్న కుతంత్రంతోనే జగన్ రెడ్డి సరికొత్తగా ‘అమూల్ బేబీ’ అవతారం ఎత్తి, సహకార డెయిరీలకు చెందిన వేలకోట్లఆస్తుల్ని గుజరాత్ సంస్థకు ధారాదత్తం చేస్తున్నాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
“ సైకోస్టార్ జగన్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రజలఆస్తులు కొల్లగొట్టడానికి రోజుకో అవతారం ఎత్తుతుంటాడు. నేడు పాడిపరిశ్రమను తనగుప్పెట్లో పెట్టుకొని, కమీషన్లకక్కుర్తికోసం జగన్ రెడ్డి అమూల్ జపం చేస్తున్నాడు. దానికోసమే ఇప్పుడు సరికొత్తగా జగన్ రెడ్డి ‘అమూల్ బేబీ’ అవతారంఎత్తాడు. ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఆస్తులన్నీ అమూల్ సంస్థకు కట్టబెట్టడమే కాకుండా, సహాకార డెయిరీలను నాశనంచేసి, వాటిని కబ్జాచేసే పనిలో జగన్ రెడ్డి నిమగ్నమయ్యాడు. అమూల్ సంస్థతో, ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకునేటప్పుడు రాష్ట్రంలోని లక్షలాది పాడిరైతులకు లబ్ధిచేకూర్చేందుకే ఖజానానుంచి కొన్నివేలకోట్లు ఖర్చుపెడుతున్నట్టు అమూల్ బేబీ జగన్ రెడ్డి పాడిరైతుల్ని నమ్మించాడు. ఇప్పుడేమో రాష్ట్రంలోని సహకార డెయిరీలైన చిత్తూరు డెయిరీ, కృష్ణామిల్క్ యూనియన్ (విజయడెయిరీ), సంగం డెయిరీ, ఒంగోలుడెయిరీలాంటి సంస్థల్ని కబ్జాచేసి అమూల్ కు కట్టబెట్టి, పాడిరైతుల్ని సదరుసంస్థకు బానిసల్ని చేస్తున్నాడు.
ఏడాదిలో అధికారంకోల్పోయి, చంచల్ గూడ జైలుకెళ్లే జగన్ రెడ్డికి, చిత్తూరుడెయిరీని 99ఏళ్లపాటు లీజుకు ఇచ్చే అధికారం ఎక్కడిది?
జగన్ రెడ్డి నేడు అడ్డగోలుగా చిత్తూరుడెయిరీకి చెందిన ఆస్తుల్ని ఏడాదికి నామమాత్రంగా రూకోటిచొప్పున 99ఏళ్లకు లీజుకు ఇస్తున్నాడు. సంవత్సరానికి రూ.కోటిచొప్పున ఒకే ఫ్లాట్ రేట్ తో 99ఏళ్ల పాటు చిత్తూరు డెయిరీని జగన్ రెడ్డి అమూల్ సంస్థకు కట్టబెట్టాడు. 2022లో కోటిరూపాయలలీజు… మరోవందేళ్లతర్వాత కూడా ఎటువంటిపెరుగుదల లేకుండా కోటి రూపాయలేనా జగన్ రెడ్డి? నేడు కోటిరూపాయలకు ఉన్న విలువ, వందేళ్లు కాదుకదా 10 సంవత్సరాల తర్వాతకూడా ఉండదు. అటువంటిపరిస్థితుల్లో, ఒకేఫ్లాట్ రేట్ కు 99ఏళ్లకు, దేనికి కక్కుర్తిపడి లీజుకిచ్చారు? ఇంకో ఏడాదిలో అధికారంకోల్పోయి చంచల్ గూడ జైల్లో ఉండే జగన్ రెడ్డి చిత్తూరుడెయిరీకి చెందిన విలువైన ఆస్తుల్ని 99ఏళ్లపాటు లీజుకెలా ఇస్తాడు? చిత్తూరుడెయిరీకి చిత్తూరునగరంలో మెయిన్ రోడ్డుపై కలెక్టరేట్ కు సమీపాన 33 ఎకరాల విలువైన భూమిఉంది. దానివిలువ కనీసంగా ఎకరం రూ.15కోట్లచొప్పున లెక్కగట్టినా రూ.500కోట్లపైనే ఉంటుంది. అలానే వీ.కోట, పీలేరు, మదనపల్లె, కాళహస్తి, పిచ్చాటూరులో చిత్తూరు డెయిరీకి చిల్లింగ్ సెంటర్లుఉన్నాయి. చిత్తూరు డెయిరీకింద జర్మనీ, జపాన్, డెన్మార్క్ వంటి దేశాల నుంచి తెప్పించిన విలువైన సామగ్రిఉంది. భూములతోసహా వాటన్నింటి విలువ రూ.650కోట్లకుపైనే ఉంటుంది. అంతవిలువైన చిత్తూరు సహకార డెయిరీ ఆస్తిని అమూల్ బేబీ జగన్ రెడ్డి ఏ రకంగా కోటిరూపాయలకు ఇస్తున్నాడు? అలాఇవ్వడానికి అతనికేం హక్కుంది? సహాకారరంగంలో ప్రధాన డెయిరీ అయిన చిత్తూరు డెయిరీని కమీషన్లకోసం అమూల్ సంస్థకు కట్టబెడతావా జగన్ రెడ్డి? గతంలో ఇలానే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు డెయిరీని అమూల్ సంస్థకు కట్టబెట్టాడు. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని సంగండెయిరీని కబ్జాచేయడంకోసం పన్నాగంపన్ని ఆ సంస్థ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర గారిపై తప్పుడుకేసులు బనాయించాడు. ఈ విధంగా తప్పుడు విధానాలతో రాష్ట్రంలోని సహకార డెయిరీలను, వాటితాలూకా విలువైనఆస్తుల్ని అడ్డగోలుగా నామమాత్రపుధరకు అమూల్ కు కట్టబెడుతున్న జగన్ రెడ్డి, సదరుసంస్థ వల్ల ఏపీలోని పాడిరైతులకు ఎలాంటి ప్రయోజనంకలిగిందో చెప్పగలడా?
పాడిరైతులకు ఇస్తానన్న 4రూపాయల బోనస్ వట్టి బోగస్ యేనా జగన్ రెడ్డి?
ఎన్నికలసమయంలో లీటర్ పాలకు రూ.4లు బోనస్ ఇస్తానని జగన్ రెడ్డిహామీ ఇచ్చాడు. ఆహామీ ఏమైందంటే సమాధానం చెప్పడు? పాడిరైతులకు కొన్నికోట్ల రూపాయల బోనస్ ఇస్తున్న సహకారరంగ డెయిరీలు మాత్రం రాష్ట్రంలో ఉండకూడదంటున్నాడు. సహకార డెయిరీలు అన్నీ పాడిరైతులకు పెద్దఎత్తున బోనస్ లు చెల్లిస్తున్నాయి. ఉదాహరణకు కృష్ణామిల్క్ యూనియన్ (విజయడెయిరీ) సంవత్సరానికి రూ.60కోట్ల బోనస్ పాడిరైతులుకు చెల్లిస్తోంది. సంగం డెయిరీ అదేబాటలో సంవత్సరానికి రూ.50కోట్లకు పైగా బోనస్ ఇస్తోంది. కానీ ‘అమూల్ బేబీ’ జగన్ రెడ్డి తీసుకొచ్చిన అమూల్ సంస్థ ఇప్పటివరకు రాష్ట్రంలోని పాడిరైతులకు ఒక్కపైసా బోనస్ ఇచ్చిందా? సహకారడెయిరీలు బోనస్ లు చెల్లించడమే కాకుండా, పాడిరైతుల కుటుంబాలకు మేలుచేసేలా అనేక సంక్షేమపథకాలు అమలుచేస్తున్నాయి.
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయడెయిరీవారు) కళ్యాణమస్తు పథకం కింద పాడిరైతుల కుటుంబాల్లో జరిగే పెళ్లిళ్లకు ఆర్థికసహాయం చేస్తున్నారు. అలానే క్షీరబంధు పథకం కింద పాడిరైతు మరణిస్తే, అతనికుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఇస్తున్నారు. అదేవిధంగా కృష్ణా మిల్క్ యూనియన్ తో పాటు, ఇతరసహకారరంగ డెయిరీలు గేదెలకు ఇన్సూరెన్స్, పాడిరైతులకు ప్రమాదబీమా, పశువుల వైద్యంకోసం ప్రతిసంవత్సరం కొన్నికోట్ల రూపాయలు రాష్ట్రవ్యాప్తంగా ఖర్చుపెడుతున్నాయి. అలానే పశువుల వీర్యసేకరణకు, సబ్సిడీపై పశుగ్రాసవిత్తనాలు, మేతకోసే చాప్ కట్టర్స్ ను రైతులకు అందిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, ఇతరపోషకాల్ని సబ్సిడీరూపంలో అందిస్తున్నారు. ఇంతచేస్తున్నా.. పాడిరైతులవిరోధి, పాలదొంగ మంత్రిఅప్పలరాజు, అమూల్ బేబీ జగన్ రెడ్డి కలిసి బోనస్ లు , మరియు సంక్షేమపథకాలు అందిస్తున్న సహకారడెయిరీలను కాదని, పాడిరైతులకు బోడిగుండు చేసే అమూల్ కు తమకమీషన్లకోసం వత్తాసుపలుకుతున్నారు. పైన ఉదహరించిన పథకాల్లో ఒక్క పథకాన్ని అయినా అమూల్ సంస్థ, రాష్ట్రంలో పాడిరైతుల సంక్షేమంకోసం అమలుచేస్తోందని చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా? పాడిరైతులకు అండగాఉంటూ, సహాకారడెయిరీలు పాడిఉత్పత్తి పెరుగుదలకు కృషిచేస్తుంటే, రాష్ట్రంలోని పాడిపరిశ్రమకు, రైతులకు పావలా ఖర్చుచేయని అమూల్ సంస్థ జగన్ రెడ్డికి ఎందుకు ముద్దు అయ్యింది? పాడిరైతులకు పాలసేకరణకోసం సహకార డెయిరీలకంటే అమూల్ సంస్థ పైసా అదనంగా చెల్లిస్తోందా…అంటే అదీలేదు. పైసా కూడా పాలకు ఎక్కువ ఇవ్వనప్పుడు అమూల్ సంస్థను ఎందుకు ఆదరిస్తున్నారు?
కొన్నివేలకోట్ల ప్రభుత్వసొమ్ము వెచ్చించి అమూల్ కోసం చిల్లింగ్, కలెక్షన్ యూనిట్లు పెట్టడమేంటి?
ప్రభుత్వసొమ్ము కొన్నివేలకోట్లు ఖర్చుపెట్టి మరీ, బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు, (బీఎంసీయూ) లు కూడా అమూల్ కోసంఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. 12,883 ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు (ఏఎంసీయూ) లని కూడా ప్రభుత్వనిధులతో ఏర్పాటుచేయడానికి సిద్ధమయ్యారు. అమూల్ సంస్థకు ఉపయోగపడే బీఎంసీయూల ఏర్పాటుకు రూ.979కోట్లు, ఏఎంసీయూలు ఏర్పాటుకు రూ.1700కోట్లు మరియు ఇతర సామగ్రికి కొన్నివందలకోట్లు ప్రభుత్వనిధులు ఖర్చుచేయడం ఏమిటి? ఇంతపెద్దమొత్తంలో వేలకోట్లప్రజలసొమ్ము అమూల్ కోసం ఖర్చుపెడుతుంటే, ఆ సంస్థ మాత్రం రాష్ట్రంలో రూపాయి పెట్టుబడి పెట్టడంలేదు. గతంలో ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 141 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, 2మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, 8 మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఒక యూహెచ్ డీ ప్లాంట్, ఒక పౌడర్ ప్లాంట్ ఉంటే , వాటన్నింటినీ ‘అమూల్ బేబీ’ నామమాత్రంగా సంవత్సరానికి రూ.3కోట్ల 38లక్షల లీజుకే జగన్ రెడ్డి అమూల్ కు ధారాదత్తం చేశాడు. ఈ విధంగా కోట్లవిలువైన ప్రభుత్వఆస్తుల్ని మన ‘అమూల్ బేబీ’ దోచిపెట్టాడు. రాష్ట్రంలో సహకారరంగంలో పనిచేస్తున్న ఏడెయిరీ మనుగడ సాగించకూడ దన్నదే జగన్ రెడ్డి ఉద్దేశంగా ఉంది. అమూల్ సంస్థ ఏపీలో పాడిరైతుల్ని దోపిడీచేసి సంపాదిస్తున్నసొమ్మంతా తీసుకెళ్లి, సొంతరాష్ట్రమైన గుజరాత్ లో పెట్టుబడి పెడుతుంది. ఆ రాష్ట్రంలోని పాడిరైతులకే లాభాలు పంచిపెడుతోందికానీ, మనరాష్ట్రానికి, మన పాడిరైతులకు నయాపైసా మేలుచేసింది లేదు.
పాలసేకరణ మరియు ప్రాసెసింగ్ భారం కూడా ప్రభుత్వమే భరిస్తూ, అమూల్ సంస్థకు ఏడాదికి రూ.40కోట్ల వరకు ఆదాచేస్తోంది…
సాధారణంగా డెయిరీ సంస్థలు పాలసేకరణకు లీటర్ కు రూ.5 నుంచి రూ.6, మరియు ప్రాసెసింగ్ కు రూ.3నుంచి రూ.4వరకు ఖర్చుచేస్తాయి. అంటే ప్రతి లీటర్ పాలకు డెయిరీలకు అయ్యే ప్రొక్యూర్ మెంట్, ప్రాసెసింగ్ ఖర్చు రూ.10వరకు అవుతుంది. కానీ నేడు మన అమూల్ బేబీ ఆ ఖర్చుభారం అమూల్ సంస్థపై పడకుండా, ఆ ప్రక్రియమొత్తాన్ని ప్రభుత్వం మీద వేశాడు. నేడు సుమారు లక్షలీటర్ల పాలు మనరాష్ట్రంలో సేకరిస్తున్న అమూల్ డెయిరీకి ఆ లెక్కన రోజుకి రూ.10లక్షలవరకు అయ్యేఖర్చు, జగన్ రెడ్డి పుణ్యమా అని ఆదా అవుతోంది. ఆ విధంగా నెలకు రూ.3కోట్లచొప్పున, సంవత్సరానికి రూ.36 నుంచి రూ.40కోట్లవరకు అమూల్ కి భారం తగ్గిస్తున్నాడు మన అమూల్ బేబీ జగన్ రెడ్డి. అమూల్ సంస్థకోసం పాలుసేకరించేపనిని జగన్ రెడ్డి ఏకంగా జిల్లాకలెక్టర్లకే అప్పగించాడు. జిల్లా అధికారులు, వాలంటీర్ల సాయంతో పాడిరైతుల్ని బెదిరించిమరీ, ప్రభుత్వమే అమూల్ కోసం పాలసేకరణకు దిగడం సిగ్గుచేటు. పాలసేకరణ ఖర్చుకూడా అమూల్ పై పడకుండా జగన్ రెడ్డి ఆ సంస్థకోసం బ్రాండ్ అంబాసిడర్ లా మారాడు.
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోని విలువైన స్థలాలనుకూడా రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకోసం అమూల్ కు కట్టబెడుతున్నారు…
పాడిరైతులశ్రమను, సహకారడెయిరీల ఆస్తుల్ని గంపగుత్తగా అమూల్ పరం చేస్తున్నజగన్ రెడ్డి, అవి చాలవన్నట్లు ప్రధాననగరాల్లో అమూల్ సంస్థ పార్లర్ లు పెట్టుకోవడానికి కూడా అమూల్ బేబీ విలువైన స్థలాలు కట్టబెట్టాడు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 45విలువైన స్థలాలను అమూల్ సంస్థకు రిటైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకోసం కట్టబెట్టడానికి రంగం సిద్ధంచేశారు. అలానే విశాఖపట్నంలో 103 ప్రదేశాల్లోని విలువైన స్థలాలు అమూల్ క అప్పగించే ప్రక్రియ వేగవంతంగా నడుస్తోంది. ఎవడబ్బసొమ్మని జగన్ రెడ్డి ఈ విధంగా వేలకోట్ల ఆస్తుల్ని అమూల్ కు దోచిపెడు తున్నాడు? విశాఖడెయిరీ, సంగండెయిరీ, ఒంగోలు డెయిరీ, చిత్తూరు డెయిరీలకు రూపాయిసాయం చేయని ముఖ్యమంత్రి, అమూల్ కోసం ఎందుకింతలా పరితపి స్తున్నాడు? అమూల్ సంస్థ ఇచ్చే కమీషన్లకోసం జగన్ రెడ్డి ఇంతలా కక్కుర్తిపడాలా? గుజరాత్ దాటిబయటకు వస్తే అమూల్ సంస్థ కూడా, అన్నికంపెనీల్లానే సాధారణ వ్యాపారసంస్థే. ఆ సంస్థఏమీ మన రాష్ట్రంలో పాడిరైతుల సంక్షేమం కోసం, పాడిపరిశ్రమ వృద్ధికోసం పనిచేయడంలేదు? అలాంటి అమూల్ సంస్థతో రాష్ట్ర పాడిరైతులకు, పాడిపరిశ్రమకు జరిగిన మేలేంటో మంత్రి అప్పలరాజు, ‘అమూల్ బేబీ’ జగన్ రెడ్డి సమాధానంచెప్పాలి” అని పట్టాభి డిమాండ్ చేశారు.