•”మాఊరు-మాబడి” పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల రక్షణకు, భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ ఉద్యమించబోతోంది
• రాష్ట్రవిద్యారంగాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు
• విద్యార్థులను విద్యకు, పాఠశాలలనుగ్రామాలకుదూరం చేయాలన్న ముఖ్యమంత్రి ప్రయత్నాలు సాగనివ్వం
• త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బడులను కాపాడేలక్ష్యంలో టీడీపీఆధ్వర్యంలో మాఊరు-మాబడి నిర్వహిస్తాం
• పార్టీలకు అతీతంగా భావితరాల భవిష్యత్ కోసం, పాఠశాలలనుకాపాడుకోవడానికి ప్రజలంతా ముందుకురావాలని పిలుపుఇస్తున్నాం
•మాజీమంత్రి కే.ఎస్.జవహర్
రాష్ట్రవిద్యారంగాన్ని నాశనంచేయడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు, చర్యలున్నాయని 3, 4, 5 తరగతులను హైస్కూల్లో పెట్టాలనడం, ప్రాథమికపాఠశాలల తగ్గింపునకుపూనుకోవడం, 9 వ తరగతినుంచీ సీబీఎస్ సిలబస్ అమల్లోకి తేవాలనిచూడటం వంటి నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్.జవహర్ తేల్చిచెప్పారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం లో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
మానవమనుగడ పరిణామక్రమానికి అన్వేషణతో కూడిన అధ్యయనం అనేదిచాలా కీలకమైంది. విద్యద్వారానే ఏదైనా సాధ్య మవుతుందని, విద్యార్జనతోనే సమాజం, దేశం బాగుడపడతాయ ని చరిత్రచెబుతోంటే, దానిగురించి కనీస అవగాహన లేకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. తరతరాలకు సంబంధించిన విద్యాసముపార్జనను జగన్ రెడ్డి తనతుగ్లక్ నిర్ణయాలతో నిర్వీర్యం చేయడానికిచేస్తున్న ప్రయత్నాలుచూస్తుంటే బాధకలుగుతోంది. నూతనవిద్యావిధానం పేరుతో 2010లో వచ్చిన కస్తూరి రంగన్ నివేదిక ఆధారంగా, జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను పాఠశాలలకు, పాఠశాలల్ని గ్రామాలకు దూరంచేసే కొత్తఎత్తుగడకు తెరలేపాడు.
గతప్రభుత్వంలో ప్రతిఏటా డీఎస్సీలునిర్వహించి, సమాజాభివృద్ధికి విద్యారంగాన్ని పరిపుష్టంచేయాలన్న సంకల్పంతో చంద్రబాబునా యుడు గారుపనిచేశారు. ఆక్రమంలోనే జన్మభూమి పేరుతో కిలో మీటర్ కు ఒక పాఠశాలనుఏర్పరిచి, విద్యను అన్నివర్గాలకు చేరు వచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు నూతనవిద్యావిధానంపేరుతో, ఆంగ్లమాధ్యమంపేరుతో పూర్తిగా విద్యావ్యవస్థ నిర్వీర్యానికే సిద్ధమయ్యాడనిపిస్తోంది. కొఠారి కమిషన్ లోని అంశాలప్రకారం ప్రతితరగతికి ఒకగది, ప్రతి తరగతి కి ఒక ఉపాధ్యాయుడు అనే నిబంధనతో పాటు, ప్రతసబ్జెక్ట్ కు ఒక నిష్ణాతుడైన ఉపాధ్యాయుడు ఉండాలనే నిబంధనలు విద్యారంగా నికి కీలకంగా మారాయి. అలాంటి నిబంధనలను గాలికి వదిలేసి న ముఖ్యమంత్రి రాష్ట్రంలో పాఠశాలలనేవి లేకుండా చేయాలనే దురుద్దేశంతో ముందుకెళ్తున్నాడు. 500 మీటర్లు, కిలోమీటర్, 3 కిలోమీటర్ల నిబంధనతో కిలోమీటర్ కు ఒకటిచొప్పున ఉన్న ప్రాథ మికపాఠశాలలను పూర్తిగా తొలగించాడనికి ఈప్రభుత్వం సిద్ధమైం ది. తద్వారా ఉపాధ్యాయులను కూడా తొలగించే కుట్రకు తెరలే పింది.
ముఖ్యమంత్రి కనీస అవగాహన కూడా లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనిపిస్తోంది.కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో-భేటీ పడావో నినాదం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో భేటీ లకు రక్షణలేకుండా చేసిందికాక, బాలికలకు విద్యనుకూడా దూరంచేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రతి మండలానికి ఒక ఇంటర్ కాలేజీ పెడతామంటున్న ఈ ప్రభుత్వం, ముందుప్రాథమిక విద్యా భాస్యాన్ని విద్యార్థులకుఎందుకు దూరంచేస్తోందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 400మంది విద్యార్థులు ఉండే పాఠశాలల్లో జూనియర్ కాలేజీ పెడితే అక్కడ విద్యాభ్యాసం మెరుగ వుతుందిగానీ, ఎక్కడో దూరంగా కళాశాలపెడితే ఉపయోగం ఉండ దు. అలానే 3, 4, 5 తరగతుల విద్యార్థులనుతీసుకెళ్లి, హైస్కూల్లో ఉన్నతవిద్యాభ్యాసం చేసేవారిపక్కన పెడితే వారికీ, వీరికి పొంతన కుదురుతుందా? వారిభోజన విరామసమయం, ఉన్నత తరగతి విద్యార్థులభోజన విరామసమయం ఒకేసమయంకాదు. అలానే వారికందించే బోధన, వీరికిఅందించే బోధనలోకూడా తేడా ఉంటుంది. ఆటల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. రాష్టంలో అనే క పాఠశాలల్లో సరిపడినన్ని ఆటస్థలాలుకూడా లేవు. ఈ విధంగా అనేకఅంశాల్లో పైతరగతుల విద్యార్థులతో 15ఏళ్లలోపు విద్యార్థినీ విద్యార్థులవిద్యావిధానం సరిపోలదు. ముఖ్యమంత్రి ఆలోచనలకు తోడు, ఆయనసలహాదారుల ఆలోచనలు కూడా దరిద్రంగా ఉంటున్నాయి.
రాష్టప్రభుత్వం విద్యారంగంపై కక్షకట్టింది కాబట్టే ఇటువంటి నిర్ణయాలు అమలుచేయాలని చూస్తోంది. కొత్తకొత్త విద్యావిధానాలతో తనకువ్యతిరేకంగా గళమెత్తిన ఉపాధ్యాయులపై కక్ష తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. సామాన్యులకు , మరీముఖ్యంగా గ్రామాల్లో ప్రభుత్వప్రాథమిక బడుల్లో విద్యాభ్యాసం కోసం వచ్చే ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గా లచిన్నారులకు విద్యను దూరంచేయడమే జగన్మోహన్ రెడ్డి అజెం డాగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా మాఊరు-మాబడి కార్యక్రమంతో పాఠశాలలరక్షణకు నడుంబిగించింది. టీడీపీ పోరాడుతోందని ఆలోచించకుండా పార్టీలకు అతీతంగా ప్రజలంతా కలిసిరావాలని విజ్ఞప్తిచేస్తున్నాం. విద్యార్థులు చదువుకోవాలంటే అన్నిఊళ్లలో పాఠశాలలనేవి ఉండాలి…కానీ అవేలేకుండా పోతే ఎలాగో ప్రజలతోపాటు అన్ని రాజకీయపక్షాలు ఆలోచనచేయాలని కోరుతున్నాం. విద్యలేని సమాజాన్ని ఊహిం చుకోవడమే కష్టంగా ఉంటుందనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలి.
జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న అమ్మఒడి పథకం కూడా అరకొ రగానే అమలవుతోంది. డీఎస్సీలు నిర్వహించకుండా, ఉపాధ్యాయ నియామకాలుచేపట్టకుండా, అంతిమంగా పాఠశాలలే లేకుండా చేయాలని చూస్తున్న ముఖ్యమంత్రి దుర్మార్గపు ఆలోచనల్ని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ప్రతిఘటించాల్సిన సమయం వచ్చింది. బడిని గ్రామానికి దూరం చేయకుండా చేయడమే మనందరి లక్ష్యంకావా లని పిలుపునిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ చర్యలు, నిర్ణయా లతో ఇప్పటికే రాష్ట్రం అన్నివిధాలా వెనుకబడిందనే వాస్తవాన్ని గుర్తించి, గ్రామాల్లోని బడులను, తద్వారా విద్యను కాపాడుకోవాల న్న ఏకైకలక్ష్యంతో ముందుకుసాగుదాం.