Suryaa.co.in

Andhra Pradesh

ఆర్యవైశ్యులంటే జగన్ కు లెక్కలేదు

– రోశ్యయ్య తనను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నాడన్న అక్కసుతోనే జగన్ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల్ని హింసిస్తున్నాడు
– సుబ్బారావు గుప్తాకు ఏం జరిగినా డీజీపీ, ముఖ్యమంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డే బాధ్యులు
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (చంద్రగిరి) టీడీపీ వాణిజ్యవిభాగం రాష్ట్రఅధ్యక్షులు డూండీ రాకేశ్

“యువగళం పాదయాత్ర 400రోజులకు చేరింది. లోకేశ్ అడుగులో అడుగువేసుకుంటూ, ప్రజల సమస్యలు వారిబాధలు కష్టసుఖాలు తెలుసుకునే పనిలో ఉంటే, పోలీసులు ప్రభుత్వా ధికారులు వారిపనిలో వారున్నారు. లోకేశ్ పై నమోదైన 12కేసుల్లో 9కేసులు పోలీసులు పెట్టినవే. వారే ఆయాకేసుల్లో ఫిర్యాదుదారులు. ఒక కేసు వీఆర్వో పెట్టింది. 30రోజుల్లో లోకేశ్ పాదయాత్రను అడ్డుకున్నవారిపై ఎక్కడా ఒక్కచిన్నకేసు కూడా నమోదుకాలేదు. రాష్ట్రంలో గంజాయి వ్యాప్తి, విక్రయాలు ఎక్కువయ్యాయి. జగన్ తన సంపాదనకోసం రాష్ట్రాన్ని గంజా యి, మాదకద్రవ్యాల హబ్ గా మార్చాడు.

సుబ్బారావుగుప్తాపై ముఖ్యమంత్రికి ఎందుకంత కక్ష?
ఒంగోలుకు చెందిన వైసీపీనేత సుబ్బారావుగుప్తాపై ప్రభుత్వం గంజాయి కేసుపెట్టింది. గతం లో సుబ్బారావుగుప్తా మంత్రిగా ఉన్న బాలినేని సమక్షంలో ప్రభుత్వంలోని వారు ప్రతిపక్షనేత ల్ని ఇష్టానుసారం బూతులుతిడుతున్నారని, ఆ ప్రభావం అధికారపార్టీపై కూడా పడుతుంద ని హితవుచెప్పాడు. దానికి ఆక్రోశించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, గంటూరులో ఉన్న సుబ్బారా వుగుప్తాని తన అనుచరులు సుభాని మరికొందరితో చావగొట్టించాడు. ఆ దృశ్యాలు సామా జిక మాధ్యమాల్లో కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆనాడు ఆర్యవైశ్య కోటాలో మంత్రిగా ఉన్నవెల్లంపల్లి శ్రీనివాస్ సుబ్బారావుగుప్తాకు న్యాయంచేస్తామని హామీఇచ్చి, ఆ వ్యవహారా న్ని సద్దుమణిగేలాచేశాడు. అదలాఉంటే ఇప్పుడు సుభానిఅనే వ్యక్తి ఈమధ్యన ఒంగోలులో ని యువతుల హాస్టల్ వద్దకు వెళ్లి నానాయాగీచేశాడు. సుభాని తీరని సుబ్బారావు గుప్తా ఖండించాడని అప్పటికప్పుడు పోలీసుల అతని బండిలో గంజాయిదొరికిందని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. నిజంగా రాష్ట్రంలో గంజాయి అమ్మేవాళ్లలో ఈముఖ్యమంత్రి, పోలీసులు ఇంత వరకు ఒక్కరిని పట్టుకున్నదాఖలాలు లేవు. కేవలం ఆర్యవైశ్యుడైన సుబ్బారావుగుప్తాపైనే ముఖ్యమంత్రికి, వైసీపీనేతలకు ఎందుకంత కక్ష అని ప్రశ్నిస్తున్నాం. నాలుగేళ్ల పాలనలో జగన్ ఆర్యవైశ్యులకు చేసింది శూన్యం. అధికారపార్టీలోని ఆర్యవైశ్యుల్ని కూడా జగన్, వైసీపీనేతలు హింసిస్తున్నారు.

జగన్ తన నాలుగేళ్లపాలనలో ఒక్కఆర్యవైశ్యుడికి కూడా న్యాయం చేసిందిలేదు. టీడీపీనుం చి వైసీపీలోకి లాక్కున్న ఆర్యవైశ్యులుగానీ, అధికారపార్టీలో ఎప్పటినుంచో ఉన్నవారికి గానీ ఈ ముఖ్యమంత్రి ఆవగింజంత న్యాయమైనా చేశాడా? జగన్ ముఖ్యమంత్రి అయినప్పటినుం చీ ఇప్పటివరకు రాష్ట్రంలో 37మంది ఆర్యవైశ్యులపై దాడిజరిగింది. దానికి సంబంధించి ఆధా రాలతో సహా బహిరంగంగా చర్చించడానికి తాముసిద్ధం.
ముఖ్యమంత్రి తన చెంచాలను పంప కుండా తాను చర్చకు రాగలడా? వైసీపీలోఉన్న 8మంది ఆర్యవైశ్యనేతలపై సొంతపార్టీ వారే దాడులకు పాల్పడింది నిజంకాదా? మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒక భూవివాదంలో తనకు అడ్డుగా ఉన్న ఆర్యవైశ్యనేతను చంపించింది వాస్తవంకాదా అని జగన్ ను ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబునాయుడు ఆర్యవైశ్యులకోసం కార్పొరేషన్ ఏర్పాటుచేస్తే, జగన్ దాన్ని మూసే శాడు. అటు చిత్తూరు నుంచి, ఇటు విశాఖవరకు ఆర్యవైశ్యులే లక్ష్యంగా అధికార పార్టీనేతలు ఎందుకు దాడులకు పాల్పడుతున్నారు? వారినే ఎందుకు హతమారుస్తున్నారు?

ఆర్యవైశ్యుల ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా వారికి జగన్ ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఆర్యవైశ్య వర్గానికి ఉన్న ఒక్కమంత్రి పదవిని కూడా జతన్ తీసేశాడు. మొన్నటి ఎమ్మెల్సీల ఎంపికలో కూడా ఆవర్గానికి జగన్ మొండిచెయ్యిచూపాడు. భయపెట్టి టీడీపీనుంచి లాక్కున్న మద్దాలిగిరి, శిద్ధారాఘవరావుకి జగన్ ఏం న్యాయం చేశాడు? తానుముఖ్యమంత్రి కాకుండా గతంలో దివంగతనేత రోశయ్య అడ్డుకున్నారన్న అక్కసుతోనే జగన్ ఇప్పటికీ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల్ని వేధిస్తున్నాడు. ఆర్యవైశ్యులను అణచి వేస్తూ, వారిని నిత్యం వేధిస్తున్న జగన్ రెడ్డి ముమ్మాటికీ ఆర్యవైశ్యులద్రోహే. రాష్ట్రంలోని ఆర్య వైశ్యులందరూ వచ్చేఎన్నికల్లో జగన్ రెడ్డికి బుద్ధిచెప్పడం ఖాయం. సుబ్బారావుగుప్తాకు ఏం జరిగినా దానికి డీజీపీ, ముఖ్యమంత్రి, బాలినేని శ్రీనివాసరెడ్డే బాధ్యులవుతారు.”

LEAVE A RESPONSE