– వివేకాహత్యజరిగినప్పడు రక్తపు మరకలు తుడిచేసినట్టే
– మైక్ లేకుండా వైసీపీఎమ్మెల్యేల, మంత్రులు అన్నమాటలు భరించలేనివి. అవి విన్న మాకు వారేమన్నారో తెలుసు
• మంత్రులు కొడాలినానీ, వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు అంబటిరాంబాబు,ద్వారంపూడిల వ్యాఖ్యలతో మా చెవులు పగిలిపోయాయి : డోలా
• వారి దూషణలను రికార్డులనుంచి తొలగించాకే నిన్నసాయంత్రం ముఖ్యమంత్రి అమాయకంగా ఏమీ తెలియనట్టు రికార్డులు చూసుకోండి అంటున్నాడు : బాలవీరాంజనేయస్వామి.
• రెండున్నరేళ్లనుంచీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యాడు
• చంద్రబాబునాయుడికి జరిగిన అవమానాన్ని ప్రతి కార్యకర్త గుండెల్లో దాచుకొని, రెట్టింపు పౌరుషంతో జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి పనిచేయాలి : ఏలూరి సాంబశివరావు.
– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు
నిత్యంప్రజాసమస్యలపై చిత్తశుద్ధితో ప్రతిపక్షంపోరాడుతుండ టాన్ని ఓర్వలేకనే, నిన్న అసెంబ్లీలో వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు పశువుల్లాప్రవర్తించారని, చేసిన దుర్మార్గాన్ని మర్చిపోయి, వారి చర్యలను సమర్థించుకోవడం హేయాతి హేయమని టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సహచరసభ్యులు డోలా బాలవీరాం జనేయస్వామి, ఏలూరి సాంబశివరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు .ఆ వివరాలు వారి మాటల్లోనే ..
గతప్రభుత్వంలో నిర్మించిన టిడ్కోఇళ్లను ప్రభుత్వం తక్షణమే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, తాము నోటీస్ఇస్తే, దానిపై చర్చించకుండా, ప్రభుత్వపెద్దలు కుప్పం రాగం ఆలపించారు. కుప్పంఎన్నికతోపాటు, ప్రజలుఎదుర్కొంటు న్న సమస్యలు, వివేకాహత్యపైచర్చించాలని తాము డిమాండ్ చేశాము. దాన్నివక్రీకరించి, ఇష్టానుసారం మాట్లా డారు. తరువాత వ్యవసాయంపై చర్చజరిగే సమయంలో కన్నబాబుసహా, ఇతరమంత్రులు కావాలనే చంద్రబాబు పై వ్యక్తిగత దూషణలకు దిగారు.
ఆఖరికి కన్నబాబు అమ రావతి ఉద్యమాన్ని హేళనచేసేలా, రైతులను కూడా తూల నాడాడు. రైతులను ఉద్దేశించి రియల్ ఎస్టేట్ గ్రూప్ అని మంత్రి అన్నప్పుడు, తాము మైక్ ఇవ్వాలనికోరితేస్పీకర్ నిరాకరించారు. ఆ సమయంలో మాశాసనసభ్యులు వీరాంజ నేయస్వామి గారు, మరికొందరు జగన్ పార్టీని జైలుపార్టీ అని అన్నవ్యక్తి ఎవరని ప్రశ్నించారు. దాంతో ఓర్వలేని కన్న బాబు, ఇతరమంత్రులు, ఎమ్మెల్యేలు బరితెగించారు. ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడో వెనకనుంచి ముందుకువచ్చి, చంద్రబాబునాయుడిపైవ్యక్తిగత దూషణలకు దిగడమే గాక, లోకేశ్ గురించి అసభ్యంగా మాట్లాడాడు. వారు అలా అంటున్నా స్పీకర్ వారించలేదు.
వారంతా నోళ్లకుపని చెప్పి, అనాల్సినవన్నీ అన్నాక, తాపీగా స్పందించినస్పీకర్ మీరు మాట్లాడంటే మాట్లాడండి అనటమేంటి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికూడా ఒకతల్లికే పుట్టాడు. అలాంటివ్యక్తి నోటి కొచ్చినట్లు మాట్లాడుతుంటే ఎవరూ వారించకపోగా, ఇంకా కొందరు అతనికిజతకలిశారు. రాష్ట్రంలోని డ్రగ్స్ మూలాల న్నీ చంద్రశేఖర్ రెడ్డిచుట్టూనేతిరుగుతున్నాయి.ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. కాబట్టే గతంలోకూడా టీడీపీ కార్యాలయాలపైదాడిచేయించారు.
మంత్రి కొడాలినానీ వ్యవ హార శైలిని కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. తమఅధినేతకు జరిగిన అవమానాన్ని నిరసిస్తూ, తామంతా పోడియంవద్దకు వెళితే, అక్కడకూడా ముఖ్యమంత్రి మాపైకి తనమంత్రులను పంపించాడు. ద్వారంపూడికి మద్ధతుగా వెల్లంపల్లిని పంపి, దాడికిప్రోత్సహించాడు. చంద్రబాబునా యుడి గుండెనిబ్బరాన్ని, మనోస్థైర్యాన్ని దెబ్బకొట్టాలన్న కుతంత్రంతోనే ముఖ్యమంత్రి వ్యవహరించారు. అంబటి రాం బాబు పేట్రేగిపోతుంటే, ఆయన్ని వారించడానికి తాము స్పీకర్ ని మైక్ అడిగితే ఇవ్వలేదు.
ఆడవాళ్లప్రస్తావన, కుటుంబసభ్యుల ప్రస్తావన సభలో చేయడం జుగుప్సాకరం. వైసీపీఎమ్మెల్యలను, మంత్రులను హెచ్చరిస్తున్నాం.ఇలానే మీరుప్రవర్తిస్తే, భవిష్యత్ లో అన్నివిధాలా చులకన అవుతా రు. చంద్రబాబునాయుడిగారికి జరిగిన అవమానంపై ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రి కావాలనే, తన అవినీతిని, తన డ్రగ్స్ బిజినెస్ ను, బాబాయ్ హత్యకేసు వ్యవహారాన్ని సభలో చర్చకురాకుండా చేయడానికి ఈ విధంగా తనపార్టీ ఎమ్మెల్యేలను ఉసిగొల్పాడు.
డ్రగ్స్ రాష్ట్రంలో లేవు, మీదగ్గర ఉంటే సమాచారమివ్వ మని అధికారులు, పోలీస్ శాఖప్రతిపక్షాన్ని అడగడం సిగ్గు చేటుకాదా? బాబాయ్ ని చంపించి రక్తపుమరకలు ఎలాగైతే తుడిపేశారో, నిన్నఅసెంబ్లీలో జరిగినదాన్ని బయటకు రాకుండా, స్పీకర్ సాయంతో రూపుమాపారు. రికార్డులను మాయంచేసి, చంద్రబాబుని ఏమీఅనలేదని చెప్పడం దుర్మా ర్గం కాదా? ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో రికార్డులుపెడితే, ఎవరు ఎలా ప్రవర్తించారో, ఎవరి ప్రవర్తనఏమిటో వారే నిర్ణయిస్తారు.
మహిళాసాధికారతపై జగన్ ని పొగిడిన వైసీపీమహిళా నోళ్లన్నీ నిన్నఎందుకుతెరుచుకోలేదు : డోలా బాల వీరాంజనేయస్వామి
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకివచ్చింది మొదలు సొంత రాజ్యాంగాన్ని అమలుచేస్తూ, ప్రతిపక్షాలపై బురదజల్లుతూ, రాష్ట్రాన్ని అప్పులపాలుచేశాడు. మానసికంగా వేధించి, ప్రతిపక్షనేతను క్షోభకుగురిచేసి,పైకి రావాలని జగన్ భావిస్తు న్నాడేమో..అలాంటిదేమీ జరగదు. తొలిరోజు అసెంబ్లీలో మహిళాసాధికారతపైచర్చ పేరుతో సొంతపార్టీ మహిళాఎమ్మె ల్యేలతో జగన్ రెడ్డి డబ్బాలుకొట్టించుకున్నాడు. తమ అన్న అలాంటివ్యక్తి..ఇలాంటివ్యక్తని పొగిడిన ఆచెల్లెమ్మల నోళ్లు నిన్న ఎందుకు తెరుచుకోలేదు? అక్కలాంటిభువనేశ్వరిని తనపార్టీ ఎమ్మెల్యేలుదూషిస్తుంటే, ఆ చెల్లెమ్మలు స్పందించ క పోవడం విచారం. అసెంబ్లీ వీడియోలుఒక్కసారి పరిశీలి స్తే, చంద్రబాబు ఎంత ఓర్చుకున్నారో అర్థమవుతుంది. ఆయన్ని ఎన్నిమాటలన్నా,ఆ బాధను భరించారు. మేం స్పందిస్తుంటే, రాజకీయాల్లో మీరుఇంకా అనుభవం పొందా లని సూచించారు.
కానీ నిన్నమాత్రం ద్వారంపూడి చంద్రశే ఖర్ రెడ్డి, కొడాలినాని, వెల్లంపల్లి శ్రీనివాస్, అంబటిరాంబాబు తోపాటు, మరో పాతికమంది వైసీపీఎమ్మెల్యేలు ఎన్నిబూతు లు మాట్లాడాలో అన్నీ మాట్లాడారు. చెవులు పగిలిపోయేలా వారువాడిన బూతులు వర్ణనాతీతం. జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే వారుఅలా ప్రవర్తించారు. అసెంబ్లీలో ద్వారంపూడి మాటలు క్షమార్హంకానివి. స్వర్గీయ ఎన్టీఆర్ గారి కుమార్తె, చంద్రబాబుగారి సతీమణి అయిన భువనేశ్వరిగారి గురించి, లోకేశ్ పుట్టుక గురించి మాట్లాడతారా? డ్రగ్ మాఫియా లో మునిగితేలుతున్న వ్యక్తి ద్వారంపూడి, తనబండారం బయటపడుతుందనే రెచ్చిపోయాడు.
జగన్మోహన్ రెడ్డి వివే కానందరెడ్డిని టీడీపీ ఓడించింది అని, అందుకే ఆయన చనిపోయాడని ఏదేదో మాట్లాడాడు. మరికుప్పంలో మీరుఎలా టీడీపీని ఓడించారో ప్రజలకు తెలియదా? కుప్పంలో ఓడిపోయినవ్యక్తి ముఖం చూడాలని పైశాచిక ఆనందం పొందడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా? తన కుటుంబసభ్యులను అవమానించిన ఈ అసెంబ్లీలోకి రానని, ప్రజాక్షేత్రంలో తేల్చుకొని,ప్రజలు ఆమోదించాకే అసెంబ్లీలో అడుగుపెడతానని చంద్రబాబునాయుడు అన్నారు. వివేకానందరెడ్డిని చంపించి, గొడ్డలితో వేట్లువేసి, రక్తపు మరకలు తుడిచేశారు.అదేపద్ధతిని అసెంబ్లీలో మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాటల్లో అనుసరించారు.
అంబటిరాంబాబు, చంద్రశేఖర్ రెడ్డి, కొడాలినానీ, వెల్లంపల్లి మాటలను రికార్డులనుంచి తొలగించాక, ముఖ్యమంత్రి అమాయకంగా మావాళ్లు ఏమీఅనలేదు.. కావాలంటే రికార్డులు చూసుకోండని అనడం ఏమిటి? ఉదయం మాట్లా డించిన మీరే, తిరిగి సాయంత్రం బుగ్గనకు మైక్ ఇచ్చి, ఆయనతో ఏవేవో అనిపించారు. చంద్రబాబుగారికి మీరుచేసిన అవమానాన్ని ప్రజలు గమనించారు. జగన్మోహ న్ రెడ్డికి నిజంగా మహిళలపై గౌరవం, మహిళాసాధికారత పై నమ్మకముంటే, తక్షణమే ద్వారంపూడిని, అంబటి రాంబా బుని, మంత్రులు కొడాలి, వెల్లంపల్లిలపైచర్యలు తీసుకోవాలి. వారితో బహిరంగంగా క్షమాపణలుచెప్పాలి.
ఇంట్లో ఉన్న ఆడవాళ్లను దూషించినవారిని వదిలేసి, చంద్రబాబుగారు ఆడవాళ్లతో రాజకీయాలుచేస్తారని అంటారా? టీడీపనేత పట్టాభిగారు ఏదో మాటంటే, దాన్ని అడ్డంపెట్టుకొని తనతల్లి ని అన్నారంటూ ముఖ్యమంత్రి తల్లిసానుభూతిని వాడుకు న్నాడు. చంద్రబాబుగారు అలాంటి దిగజారుడుచర్యలకు పాల్పడే వ్యక్తికాదు. అందుకు ఆయన 40ఏళ్ల రాజకీయ జీవితమే నిదర్శనం. నిన్నజరిగిన ఘటనతో జగన్మోహన్ రెడ్డి ఆయనపార్టీ పతనం ప్రారంభమైంది. త్వరలోనే మూటా ముల్లేసర్దుకొని రాష్ట్రంవదిలిపోవడం ఖాయం.
రెండున్నరేళ్లనుంచి టీడీపీని, కార్యకర్తలను లేకుండా చేయడానికి జగన్ చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో, చివరకు చంద్రబాబునాయుడి మనోస్థైర్యం దెబ్బతీయడానికి ప్రయత్నించాడు : ఏలూరి సాంబశివరావు
రెండున్నరేళ్లక్రితం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైంది. అధికారమదంతో వ్యవ హరిస్తూ తనచేతగాని పాలనతో జగన్ అసమర్థ ముఖ్యమం త్రిగా చరిత్రలో నిలిచిపోయాడు. తనస్వార్థానికి జగన్ రాజకీ యాలను, అధికారాన్ని వాడుకుంటున్నాడుతప్ప ఎక్కడా ప్రజలకు ఉపయోగపడే పనులుచేయడంలేదు. తన పాలనా వైఫల్యాలను, అక్రమాదాయ మార్గాలను ప్రజలు గుర్తించార ని, వాటిని తెలుగుదేశంప్రజల్లోకి తీసుకెళుతోందనే భావించే జగన్మోహన్ రెడ్డి నిన్న అసెంబ్లీలో బరితెగించాడు. చంద్రబా బానాయుడి ఇంటిపైదాడి, టీడీపీ కార్యాలయంపై దాడి వంటి చర్యలతో పాటు, టీడీపీనేతలను అడ్డుకోవడం, గతంలో టీడీ పీప్రభుత్వంలో పనులుచేసినవారికి బిల్లులుచెల్లించకుండా వేధించడం వంటిచర్యలకు పాల్పడ్డాడు.
గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తమొదలు చంద్రబాబునాయుడి వరకు ఎవరి నీ వదిలిపెట్టకుండా తనవేధింపులకు గురిచేశాడు. కానీ టీడీపీ కార్యకర్తమొదలు చంద్రబాబువరకు అందరూ ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని, ముఖమ్యమంత్రిని నిలదీస్తూనే ఉన్నారు. చంద్రబా బునాయుడు ఎలాంటివ్యక్తో, ఆయన ఎంతహుందాగా ఉంటారో తెలుగువారికి బాగాతెలుసు. ఎన్నిచేసినా ఎంతలానొప్పించినా చంద్రబాబునాయుడనే వ్యక్తి తన స్థైర్యాన్నికోల్పోవడం లేదనే, నిన్న తన పార్టీవారి తో అనరాని మాటలనిపించాడు.
జాతీయస్థాయిలో మచ్చలేని నిఖార్సైన నాయకుడు చంద్రబాబునాయుడుగా రు. స్వర్గీయఎన్టీఆర్ తర్వాత ప్రజలమనస్సుల్లో చెరగని స్థానం పొందినవ్యక్తి చంద్రబాబునాయుడుగారు. అలాంటి వ్యక్తిని ఏదోరకంగా అప్రతిష్టపాలుచేయాలనే నిన్న అసెంబ్లీ లో అధికారపార్టీవారుచెత్తచెత్తగా మాట్లాడారు. అసెంబ్లీలో అధికారపార్టీ వారు మైక్ ల్లో రికార్డయ్యేలా మాట్లాడేది చాలా తక్కువ. విడిగా పెద్దగొంతుతో అరుస్తూ అనరాని మాటలు అనడమే ఎక్కువజరుగుతోంది. అలాంటిఘటనలు కోకోల్లలు. ఇవన్నీ విని మేమే అప్పుడప్పుడు మనం ఇక్కడకుఎందుకురావాలని చంద్రబాబుగారిని ప్రశ్నిస్తే, ప్రజలకోసం బాధ, కష్టం అనుభవిద్దామని చెప్పేవారు. అలాంటివ్యక్తి ఎంతబాధపడితే నిన్నఅలాంటితీవ్రమైన నిర్ణ యం తీసుకుంటారు?
మేమంతా మాతృమూర్తిగా భావించే వ్యక్తిని దూషించేవరకువైసీపీవారు వెళ్లారు. ఆ అవమానం తట్టుకోలేక నిన్న చంద్రబాబునాయుడుగారు అసెంబ్లీని కౌరవసభతో పోల్చారు. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ నేతలుఎలాగైతే ప్రవర్తించారో, అలాంటిప్రవర్తనను ఎవరూ హర్షించరు. చేతగాక,చేవలేకసత్తాలేకనే వైసీపీనేతలు ఇలాంటి చెత్తరాజకీయాలు చేస్తున్నారు. ప్రజలంతా వైసీపీనేతలకు ఈప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది. వైసీపీనేతల వికృతచేష్టల కు ప్రతితెలుగువారి గుండె గాయపడింది.
ఈ ప్రభుత్వానికి కాలంచెల్లిందని ప్రజలే అంటున్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ చంద్రబాబునాయుడిగారికి జరిగిన అవమానాన్ని సహించలేకపోతున్నారు. టీడీపీ కార్యకర్తలందరూ తమనాయకుడికి జరిగిన అవమానాన్ని , భాధని గుండెల్లోనే ఉంచుకొని, పౌరుషంగా మార్చుకొని చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రినిచేసేవరకు విశ్రమించ కుండా కృషిచేయాలని కోరతున్నాం. సమాజంలో రాజకీయాలకుఅతీతంగా ప్రవర్తించే విజ్ఞులు,మేథావులు కూడా నిన్నజరిగిన సంఘటనపై ఆలోచించాలి. మేథావుల మౌనంతో మూర్ఖులసంఖ్య పెరుగుతుంది.
దాన్ని గమనించి ప్రతిపక్షనేతకు జరిగిన అవమానంపై ప్రతిఒక్కరూ ఆలోచన చేయాలి. అటువంటి ఘటనలురాజకీయాల్లో మున్ముందు పునరావృతంకాకుండా చూడాల్సిన బాధ్యతే విజ్ఞులదే. అధికారం ఉందన్న మదంతోపిచ్చికుక్కల్లా మాట్లాడారు. వారికి అధికారాన్ని దూరంచేయడానికే చంద్రబాబుమంచి నిర్ణయం తీసుకున్నారు.