వివేకా హత్యకేసు మెడకు చుట్టుకుంటోందని జగన్ కు అర్థమైంది

– అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతంతో ముఖ్యమంత్రి మతిచలించింది
– ప్రజలు తనకు బుద్ధిచెబుతారనిభావించే, చంద్రబాబు లక్ష్యంగా దుర్మార్గపు రాజకీయాలకు తెరలేపాడు
– భువనేశ్వరిని దూషించినందుకు జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాష్ట్రమహిళాలోకానికి బహిరంగ క్షమాపణచెప్పాలి
– నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీ.వీ.ఆంజనేయులు
నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు వైసీపీ అంతానికి నాందిపలికాయని, 1993లో స్వర్గీయఎన్టీఆర్ గారు, ప్రతిపక్ష నేతగాఉన్నప్పుడు అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయిం చుకుంటే, ఆనాడు చంద్రబాబునాయుడు పెద్దాయన కు నచ్చచెప్పి, ప్రజలసమస్యలు పరిష్కారం కావాలంటే మనం అసెంబ్లీలో ఉండాలనిచెప్పి ఒప్పించారని, …. చట్టసభలను గౌరవించే గొప్పవ్యక్తి చంద్రబాబునాయుడిని నేడు వైసీపీ ముష్కరులు మానసికక్షోభకు గురిచేయడం దుర్మార్గమని టీడీపీసీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయులు ఆవేదనవ్యక్తంచేశారు. శనివారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలుఆయన మాటల్లోనే …
చట్టసభలను అమితంగా గౌరవించే వ్యక్తి, నేడు ఆ సభలోకి రాను అన్నాడంటే, వైసీపీదుర్మార్గులు ఆయన్నిఎంత బాధ పెట్టారో అర్థమవుతోంది. ఎన్ని అవమానాలకు గురిచేశారో ప్రజలు అర్థంచేసుకోవాలి. 151 మందిమి ఉన్నామని విర్రవీ గుతున్నారేమో.. గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పశువులను, రాక్షసులను ప్రోత్సహించి చంద్రబాబు నాయుడిగారిని కావాలనే వేధింపులకు గురిచేశారు.
నేడు వివేకాహత్యకేసు వ్యవహారం జగన్ మెడకు చుట్టుకోబో తోంది. దానికితోడు అమరావతిరైతుల మహాపాదయాత్ర విజయవం తమై, తనప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని భావించే, ముఖ్యమంత్రి అసెంబ్లీలో దుర్మార్గంగా వ్యవహరించాడు. తనపార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షనేతను దూషిస్తుంటే, విలన్ లా జగన్ ఆనందిస్తాడా? వెకిలినవ్వు లు నవ్వుతాడా? సభపై గౌరవం ఉన్నవారుఎవరైనా రాక్షసుడిలా ఆనందిస్తారా? జగన్ వికృతచేష్టలతో ఆయనప్రభుత్వానికి రోజులుదగ్గరపడ్డాయి. తన సొంత జిల్లా కడపలో వర్షంధాటికి ప్రజలంతా నిరాశ్రయులై, ఆస్తిని, ప్రాణా లను కోల్పోతే దానిగురించి ముఖ్యమంత్రి పట్టించుకోలేదు.
వరదవల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలనే ఆలోచన చేయకుండా, చంద్రబాబుగారిని క్షోభపెట్టడానికి తనసమయా న్ని ముఖ్యమంత్రి వెచ్చిస్తున్నాడు. జగన్ నీ అంతం ఆరంభమైంది.. నీ డ్రగ్స్ కార్యకలాపాలు, ప్రజలసమస్యలు అసెంబ్లీలో చర్చకువస్తాయని భావించే చంద్రబాబుని దూషింపచేశావు. దేవతలాంటి భువనేశ్వరిగారిని అవమానించినందుకు, జగన్మోహన్ రెడ్డి తక్షణమే రాష్ట్రమహిళలందరికీ బహిరంగక్షమాపణచెప్పాలి. చంద్రబాబు గారు ఎంతటి మానసికక్షోభ అనుభవిస్తే అసెంబ్లీలో అడుగుపెట్టను అని అన్నారో ప్రజలంతా ఆలోచించాలి.
అంతేగానీ దుర్మార్గుడి పాలనలో విషపు ఆలోచనల్లో పడి కొట్టుకుపోవ డం మంచిదికాదు. ఈ వెకిలినవ్వులు, ఈ దుర్మార్గాలు ఇంకా కొద్దికాలమే. వైసీపీప్రభుత్వపతనం ఆరంభమైంది. ఎవరైతే దుర్మార్గాలు, దోపిడీలు చేస్తున్నారో వారిని శిక్షించే తీరుతాం. మంత్రిపద వులు కాపాడుకోవడానికి మంత్రి పదవి పొందడానికి వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తుంటే, ముఖ్యమంత్రి చూస్తూ ఊరుకుంటాడా? రాష్ట్రాన్నిఅప్పులపాలుచేస, ప్రజలను అథోగతి పాలుచేసిన జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రిస్థానంలో కొనసాగే అర్హతలేదు.
అహంకారంతో సొంత తండ్రి చెంపఛెళ్లు మనిపించిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. తల్లిని చెల్లిని రాజకీయాలకు వాడుకొని వదిలేశాడు. అలాంటి మూర్ఖుడికి చట్టసభలంటే గౌరవం లేదు. ప్రజలంటే గౌరవం భయంలేవు. ధరలుపెరిగి ప్రజలు అవస్థలుపడుతుంటే, రైతులువిలపిస్తుంటే, ముఖ్యమంత్రికి అవేవీ పట్టడంలేదు. వచ్చేఎన్నికల్లో ప్రజలు దుర్మార్గులను రాష్ట్రంనుంచి తరిమికొట్టి, అభివృద్ధిప్రధాత అయిన చంద్రబాబుకి పట్టం కట్టడంఖాయం. టీడీపీప్రభుత్వం అధికారంలోకివచ్చాక, ఈ జగన్మోహన్ రెడ్డి, ఆయన తాబేదార్ల సంగతేంటో చూస్తాం.

Leave a Reply