జగన్ సర్కారును రద్దు చేయండి

-వారికి డీఎన్‌ఏ టెస్టు చేయాల్సిందే
– టీడీపీ సికింద్రాబాద్ అధ్యక్షుడు సాయిబాబా
ఏపీలో అరాచకశక్తులను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంటు అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి పరిమితమైన, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరినుద్దేశించి వ్యాఖ్యలు చేసిన వారి నాలుకలు కోయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో చంద్రబాబు కుటుంబాన్ని తూలనాడిన వారందరికీ డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
‘వైఎస్ మాదిరిగా ఎన్టీఆర్ తన వారసులకు అరాచకం, సైకో, ప్రజాధనం లూటీ చేయటం ఎలాగో నేర్పలేదు. కుటుంబసభ్యులను గొడ్డలితో నరకడం ఎలాగో నేర్పించలేదు. బాబాయిని కొట్టడం ఎలాగో నేర్పించలేదు. వారికి నిబద్ధతతో కూడిన క్రమశిక్షణాయుత జీవితాన్ని నేర్పించారు. అందుకే ఎన్టీఆర్ కుటుంబం నేటికీ మచ్చలేకుండా జీవిస్తోంద’ని ఆయన వ్యాఖ్యానించారు. వెన్నుముక లేని కుక్కమూతిపిందెలు, పరాన్నభుక్కులే చంద్రబాబు కుటుంబంపై నీతి-జాతి లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సందర్భంగా జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల కిశోర్, కె.బోస్, పి.బాలరాజ్‌గౌడ్, బిల్డర్ ప్రవీణ్‌కుమార్, పెద్దోజు రవీంద్రాచారి, రాజాచౌదరి, విజయశ్రీ, యానాల అనంత్ రెడ్డి . K. పర్శురాo. R.భాస్కర్ రాజు.ఆనంద్ , గుప్తా.పెంటం రాజు ప్రేమ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply