Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం కడతామని మోసగించారు

-పదేళ్లలో ఒక్క అడుగు ముందుకు పడలేదు
-ఒక్క ఎకరాకైనా పరిహారం ఇచ్చారా..జగన్‌?
-ప్రత్యేక హోదా కోసం ఏనాడైనా ఉద్యమించారా..
-బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. జగన్‌ వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. పోలవరం ముంపు బాధితులను ఆదుకుంటామన్నారు. ఎకరాకు రూ.10 లక్షల పరిహారం ఇస్తామని చెప్పారు. ఒక్క ఎకరానికైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎకరం ధర ఇప్పుడు రూ.20 లక్షలు పైనే ఉంది. జగన్‌ ఇచ్చే పరిహారం సరిపోతుందా? ముంపు బాధితులకు కాలనీలు కట్టి ఇస్తామని మోసం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ హోదా ఇచ్చింది.

ఈ పదేళ్లలో ప్రాజెక్ట్‌ ఒక్క అడుగు ముందుకు పడలేదు. బాబు, జగన్‌ ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని మోసం చేశారు. ప్రత్యేక హోదా రాకుండా రానివ్వకుండా చేశాడు. అధికారం అనుభవిస్తూ ఒక్క నాడైనా ఉద్యమం చేశారా? మీరు వారికి వేసే ఓటుతో ప్రత్యేక హోదా వస్తుందా లేదా ఆలోచన చేయండి. ఉద్యోగాలు ఇస్తారా? రాజధాని కడతారా? ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పోలవరం ఎమ్మెల్యే ఇసుక బాలరాజు..మొత్తం ఇసుక దోచేశాడట. మట్టి మాఫియా చేశాడట. ఆయనకు చెడ్డ పేరు వచ్చిందట. ఇప్పుడు సీటు ఆయ న భార్యకు ఇచ్చారు. దోపిడీ చేయటానికి ఎవరైతే ఏంటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వస్తే హోదా వస్తుంది..పోలవరం ప్రాజెక్టు కడతాం..ముంపు బాధితులను న్యాయం చేస్తామని తెలిపారు.

LEAVE A RESPONSE