ఎఫ్‌జీఏజీ చర్చిలో కన్నా ప్రార్థనలు

సత్తెనపల్లి పట్టణం అంబేద్కర్‌ నగర్‌లోని ఎఫ్‌జీఏజీ చర్చి ప్రతినిధుల ఆహ్వానం మేరకు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ ఈస్టర్‌ పండుగ వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఏసు ప్రభువు తన పునరుజ్జీవం ద్వారా మనలో మార్పును ఆశిస్తూ సన్మార్గంలో నడిపించాలని కోరుకున్న పవిత్రమైన రోజు ఈస్టర్‌ పర్వదినమని, అందరూ క్రీస్తు మార్గంలో నడవాలని సందేశమిచ్చారు. అనంతరం క్రైస్తవ సోదరులకు ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపారు. సత్తెనపల్లిలో కన్నాను, నరసరావుపేట పార్లమెంటులో శ్రీకృష్ణ దేవరాయలు అఖండ మెజారిటీతో గెలవాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని దైవసేవకు లు, పాస్టర్‌ కోటేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సంఘ పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply