Suryaa.co.in

Political News

ఖాన్ గ్రెస్ 2024 లో కనీసం 100 సీట్లు గెలుస్తుందా?

పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేట్ 14% నుండి 15% వరకు ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 350 నుంచి 400 స్థానాల్లో పోటీ చేస్తోంది. 2024లో ఈ సంఖ్య దాదాపు 250 సీట్లకు పడిపోయింది. స్ట్రైక్‌రేట్‌ అలాగే ఉంటే కాంగ్రెస్‌ 35 దాటడం చాలా కష్టం. పశ్చిమ బెంగాల్, యుపి, బీహార్, ఢిల్లీ, ఒడిస్సాలలో కాంగ్రెస్ ఉనికిలో లేదు. ఈ అన్ని రాష్ట్రాలలో పార్టీ స్వంతంగా లేదా విజయం కోసం దాని సంకీర్ణ భాగస్వామిపై పూర్తిగా ఆధారపడి ఉంది. దురదృష్టవశాత్తూ గత రెండు ఎన్నికల నుంచి కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి+ ఓడిపోతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఏవైనా సీట్లు రావడం రిమోట్‌గా కనిపిస్తోంది.

ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర హెచ్‌పీ, యూకే కాంగ్రెస్‌లు నేరుగా బీజేపీతో తలపడుతున్నాయి. ఈ రాష్ట్రాలన్నింటిలో భాజపా క్లీన్‌స్వీప్‌ చేస్తూ అతి తక్కువ సీట్లు మాత్రమే మిగిల్చింది. ఇది 2024లో కూడా కొనసాగుతుంది. కాంగ్రెస్+ అర డజను కంటే ఎక్కువ సీట్లు గెలవలేదు. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఐదు నుంచి ఏడు సీట్లు రావడం ఆశాజనకంగా కనిపిస్తోంది.

డౌన్ సౌత్ లో, కాంగ్రెస్ ఏపీలో లేదు. తమిళనాడులో పార్టీ డీఎంకే పరాన్నజీవి. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంది. కానీ బీజేపీ చాలా బలంగా ఉంది. బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే కాంగ్రెస్ కూడా ఈ రెండు రాష్ట్రాల్లో డజను లేదా అంతకంటే ఎక్కువ సీట్లను తీసుకోబోతోంది. కేరళలో ఆ పార్టీ బాగా రాణిస్తుందని, దాదాపు 15 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.

అందువల్ల కాంగ్రెస్‌కు 40 నుంచి 60 మధ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఎన్‌డిఎ శిబిరంలో లేదా రాహుల్ గాంధీ కలలో గొప్ప గందరగోళం జరిగితే మాత్రమే 100 సీట్లు సాధించవచ్చు.

– K. రాజగోపాలన్ సూర్య నారాయన్ గారి quora కి స్వేచ్చానువాదము : మన్నవ హనుమ ప్రసాదు గుంటూరు

LEAVE A RESPONSE