Suryaa.co.in

Andhra Pradesh

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు లేఖ

పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

 రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్న కారణంగా లబ్ధిదారులకు నగదు అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్దిదారులకు నగదు రూపంలో పెన్షన్‌ మొత్తం చెల్లించాలని లేఖలో పేర్కొన్నారు.

గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్‌ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీని కోసం సచివా లయ సిబ్బంది పెన్షన్‌ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి… పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు అనే వార్తలు వస్తున్నాయి…ఈ కారణంగా పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు వెంటనే అందుబాటులో ఉంచండి… గతంలో ఇచ్చిన విధంగా 1 నుంచి 5వ తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవరమైన యంత్రాంగాన్ని, నిధులను సిద్ధం చేయాలని చీఫ్‌ సెక్రటరీతో పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా లేఖ రాశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల ప్రధానాధికారికి లేఖలో విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE