Suryaa.co.in

Andhra Pradesh

అహంకారానికి, అరాచకానికి చెంపపెట్టు

– వైసీపీ ప్రభుత్వాన్ని ఓటర్లు తిరస్కరించారు
-జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి

గుంటూరు: ఐదేళ్ల కాలంలో అహంకారపూరితంగా, అరాచకంగా, అవినీతిమ యంగా, అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు తిరస్కరించారని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భావ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వకుండా 13.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలో ఉంచటంపై ఆంధ్ర ఓటర్లు ఆగ్రహించారన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ప్రజా సమస్యలు పరిష్కారమవు తాయనే నమ్మకంతో కూటమిని గెలిపించారని తెలిపారు. ప్రభుత్వ పథకాలకు బతికి ఉన్న జగన్‌ పేరు పెట్టడం, ప్రజల డబ్బు ప్రజలకుకిచ్చి ఉచిత పథకాలతో ఓట్లు కొనుగోలు చేయాలనే దుగ్ధను ప్రజలు గమనించారన్నారు. భూమి హక్కు చట్టంపై ప్రజలు ఆగ్రహించారన్నారు. వైకాపా అభ్యర్థులను ఉద్యోగులను మార్చి నట్లు వివిధ నియోజకవర్గాలకు బదిలీ చేయడం నష్టం కలిగిందన్నారు. వైకాపా పార్టీకి నిర్మాణం లేదని, కమిటీలు, సభ్యత్వం, సమీక్షలు లేవని, ఆధునిక రాజుగా జగన్‌ ప్రవర్తించడాన్ని ప్రజలు గమనించారన్నారు. భవిష్యత్‌లో వైసీపీ కనుమరు గవుతుందని వివరించారు. విద్యుత్‌ ధరలను గణనీయంగా పెంచి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లాంటి బినామీలకు వేలాది కోట్లు లబ్ధి చేకూర్చడాన్ని ప్రజలు అసహ్యిం చుకున్నారని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE