వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ప్రభుత్వం పాపం పండింది

– వివేకానంద రెడ్డిని చంపేస్తే ఎన్నికలలో ఓట్లు వస్తాయి.. అధికారంలోకి రావచ్చు… నిందను తెలుగుదేశం పార్టీ మీద వేయవచ్చనే కుట్రతో సొంత చిన్నాన్నను ఎవరైనా చంపేస్తారా?
– వైఎస్ వివేకా హత్యకు కారకులైన ఆ ఇద్దరు ( కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ) సీఎం జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళు అంట..అయితే ప్రజలు ఏమవుతారు?
– సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేస్తేనే దిక్కులేదు.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?
– జగన్మోహన్ రెడ్డి ప్రజల రక్షకుడు కాదు.. భక్షకుడిగా మారాడు
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

నెల్లూరు: వైఎస్ వివేకా హత్య విషయంలో పార్టీలకు అతీతంగా మేమందరం బాధపడ్డాం.వైఎస్ వివేకా ఒక మంచి మనిషి, ఏ పార్టీ అయినా కావచ్చు, ప్రజలతో మమేకం అవుతారు, ప్రజలతోనే ఉంటారు. వైఎస్ వివేకానంద రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంత చిన్నాన్న.

అలాంటి వివేకానంద రెడ్డిని, వారి సొంత గడ్డ పులివెందులలో వారి సొంత ఇంట్లో అతి కిరాతకంగా చంపేశారు. అప్పట్లో హత్యను చంద్రబాబు నాయుడు చేయించారని, హత్య వెనుక కడప నేతలు ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హస్తం ఉందని గత ఎన్నికలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి వైసీపీ నాయకుల వరకు జోరుగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు.

దానికి మసిపూసి మారేడు కాయలా ఏదో చేయాలని చూశారు. చివరకు ఏమైంది నిజాలు దాగవు. ఎప్పటికైనా నిజం బయటకు రావాల్సిందే, దేవుడు ఉన్నాడు, కాబట్టే వాస్తవాలు బయటకు రాలేదా.. హంతకులు ఎవరో అందరికీ తెలిసింది కదా?
సీబీఐ విచారణలో ఒకటొకటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం కుటుంబ సభ్యులు, వైసీపీ ప్రజా ప్రతినిధులు, ఆయన అనుచరులే ప్రధాన నిందితులు.సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి.. జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలి?

ఒక సీఎం సొంత చిన్నాన్న చనిపోతే వాస్తవాలు బయటకు వస్తుంటే.. హత్య చేసిన వాళ్ల అంతు చూడాల్సిన జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు? సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌనం అర్ధాంగీకారమా.. వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లే కదా?
వైఎస్ వివేకాను హత్య చేసిన వారిని షాడో సీఎం, మంత్రి మండలి బాస్ సజ్జల రామకృష్ణారెడ్డి వెనకేసుకొని వస్తుండడం వెనుక మీ ఆంతర్యం ఏమిటి?
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతను నువ్వు, నీ భర్త ఏమైనా హత్య చేశారేమో అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం బాధాకరం.

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్వయంగా మీడియా ముందుకు వచ్చి తనకు సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన అనుచరుల నుండి ప్రాణహాని ఉందని, హత్య చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడం దురదృష్టకరం.
ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏమని సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాడే భాష.. పెట్టే కేసులు.. పెడితే రేప్, హత్యాయత్నం వంటి అక్రమ కేసులు, మానవత్వం లేకుండా మృగాలా ప్రవర్తిస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారా?

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు.. ప్రజల పట్ల దుర్మార్గంగా కొందరు పోలీసులు ప్రవర్తిస్తుండడంతో బాధాకరం. యధా రాజా తథా ప్రజా అన్న రీతిలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు.. పద్ధతి మార్చుకోకుంటే రాబోయే రోజులలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు నగర టీడీపీ ఇంచార్జ్, మాజీ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు మామిళ్ళపల్లి శ్రీనివాసులు నాయుడు, వెంకటాచలం, తోటపల్లి గూడూరు మండలాల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, సురేష్ రెడ్డి, సత్య నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు విజేత, శైలజమ్మ తదితరులు పాల్గొన్నారు.