– టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమల నడక దారిలో శుక్రవారం రాత్రి చిరుత దాడికి గురై మరణించినట్లు భావిస్తున్న బాలిక లక్షిత కుటుంబానికి రూ 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందిస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. మృతురాలి కుటుంబసభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. టీటీడీ రూ 5 లక్షలు, అటవీ శాఖ రూ 5 లక్షలు కలిపి మొత్తం రూ 10 లక్షలు లక్షిత కుటుంబానికి అందజేస్తామని ఆయన చెప్పారు.